నూతన సంప్రదాయానికి నాంది | new culture in the marriage | Sakshi
Sakshi News home page

నూతన సంప్రదాయానికి నాంది

Published Sat, Jul 29 2017 10:54 PM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM

new culture in the marriage

అనంతపురం కల్చరల్‌: సాధారణంగా పెళ్లిళ్లకో, మరో శుభకార్యానికో హాజరైన వారికి చిన్నపాటి జ్ఞాపికను అందివ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అనంతపురానికి చెందిన వ్యాపారవేత్త ముచ్చుకోట నరసింహారెడ్డి, నారాయణమ్మ దంపతులు వినూత్నంగా ఆలోచించారు. శనివారం జరిగిన తమ​కుమారుడు హరినాథరెడ్డి వివాహ వేడుకకు హాజరైన అతిథులకు, బంధుమిత్రులకు ‘సంపూర్ణ ఆరోగ్యానికి జీవన సూత్రాలు’ అన్న పుస్తకాన్ని అందించారు.  నిత్య జీవితంలో ఎదురయ్యే పలు రుగ్మతలకు ప్రకృతి వైద్యంతో చేసుకునే చికిత్సలు ఈ పుస్తకంలో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఇలాంటి పుస్తకాలు ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా నరసింహారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement