కట్నం వేధింపులతో మహిళ ఆత్మహత్య
జోగిపేట, న్యూస్‌లైన్ : అదనపు కట్నం వేధిం పులు తాళలేక మండల పరిధిలోని డాకూర్ గ్రా మానికి చెందిన జ్యోతి (22) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ ముకీద్‌పాషా కథనం మేరకు.. అందోల్ మండలం డాకూర్ గ్రామానికి చెందిన భూమయ్యకు టేక్మాల్ గ్రామానికి చెందిన జ్యోతినిచ్చి ఏడాదిన్నర క్రితం లాంఛనాలతో వివాహం చే శారు. మొదట్లో వీరి సంసారం సాఫీగా సాగి నా కొంత కాలం తరువాత భర్త రూ. లక్ష అదనపు కట్నం తేవాలని వేధించేవాడు. సోమవా రం కూడా కట్నం డబ్బు తేవాలని భర్త భూమ య్య వేధించసాగాడు. దీంతో భర్త పెట్టే వేధిం పులు తాళలేక ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకంగా ఉండటంతో ఆమెను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.