Mukund Pandey
-
అటు ప్రేమ... ఇటు హర్రర్!
‘ఎల్ 7’ అనే వైవిధ్యమైన టైటిల్‌తో, హర్రర్, కామెడీ ప్రధానాంశాలుగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. అరుణ్ అదిత్, పూజా ఝవేరీ జంటగా రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి. ఓబుల్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముకుంద్ పాండే దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘అందమైన ప్రేమకథకు హర్రర్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ‘ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం’ చిత్రాలకు పనిచేసిన ముకుల్ పాండే ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కిస్తున్నారు’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అరవింద్ శంకర్, కెమెరా: దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.కిషోర్. -
ప్రేమలో పదనిసలు
‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మనం’ చిత్రాలకు రచనా సహాకారం అందించిన ముకుంద్ పాండే దర్శకత్వం వహిస్తున్న ‘ఎల్-7’ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ‘తుంగభద్ర’ ఫేమ్ అదిత్, పూజా ఝవేరి జంటగా బి. ఓబుల్ సుబ్బారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు దశరథ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు విజయ్‌కుమార్ కొండా గౌరవ దర్శకత్వం వహించారు. ప్రేమలోని పలు దశలను ఆవిష్కరిస్తూ సాగే ప్రేమ కథ ఇదని ముకుంద్ పాండే పేర్కొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: మోహన్‌రావు. బి-సతీష్ కొట్టే-కె. పున్నయ్య చౌదరి, సమర్పణ: మాస్టర్ ప్రీతమ్ రెడ్డి.