రూ.8 వేల కోట్లు వెనక్కితెచ్చాం: కేంద్రం
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న అక్రమ ధనంపై దాదాపు రూ. 8,186 కోట్ల పన్నును భారత్‌కు తీసుకొచ్చామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక శాఖకు చెందిన ఎకనామిక్స్ ఎఫైర్స్ విభాగం ప్రత్యేక అఫిడవిట్లో కోర్టుకు ఈ విషయం వెల్లడిచింది.
అలాగే పనామా పేపర్లలో పేర్లున్న వారిపై న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరిపించాలన్న పిల్‌ను కొట్టివేయాలని, వేగవంతమైన విచారణ కోసం సీబీడీటీ, ఆర్బీఐ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఈడీలతో మల్టీ ఏజెన్సీ గ్రూపు(ఎంఏజీ)ను ఏర్పాటు చేశామని కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.