Mumbai floods
-
థ్యాంక్యూ ఇండియా: ఫ్రెంచ్ కుటుంబం లేఖ
సాక్షి, ముంబై: థ్యాంక్యూ ఇండియా.. ఇది ఓ ఫ్రెంచ్ కుటుంబం చెప్పిన మాట. వరదల్లో చిక్కుకుని సురక్షితంగా ఇంటికి చేరిన ఆకుటుంబం ఓ ఉత్తరం రాసింది. వివరాల్లోకి వెళ్లే బోలెస్వాస్కి అనే వ్యక్తి కుటుంబంతో సహా భారత పర్యటనకు వచ్చి ముంబై వరదల్లో చిక్కుకుపోయారు. దాదార్‌లోని మూడు హోటల్స్‌కు వెళ్లారు. అయితే ఎక్కడా వారికి రూం, వసతి దొరకలేదు. అయితే చీకటిలో చిరుదివ్వెలాగా వారికి గురుద్వారా ఆశ్రయం కల్పించింది. గురుద్వారా నిర్వాహకులు వారిని సాదరంగా లోనికి ఆహ్వానించారు. ఆకలితో ఉన్న బోలెస్వాస్వి కుటుంబానికి దాల్ కిచిడీ పెట్టి కడుపు నింపింపారు. విదేశీయులు కావడంతో నిర్వాహకులు వారి భద్రత దృష్ట్యా ఓ చిన్న గదిని కుడా ఇచ్చారు. మరుసటి రోజు తమ దేశానికి వెళ్లిన బొలెస్వాస్కి కుటుంబం పొందిన సహాయాన్ని మర్చిపోలేదు. గురుద్వారా నిర్వాహకులు అందించిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ఓఉత్తరం రాశారు. ముంబై వరదలు తమకు చేదు అనుభవంకాగా, గురుద్వారాలో తమను ఆదరించిన తీరు ఓ తీయని జ్ఞాపకంగా తమ జీవితంలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. తమకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా తమలాంటి మరికొంత మందిని ఆదుకోవాలంటూ ఆర్థిక సహాయం అందించారు. ఈసందర్బంగా గురుద్వారా నిర్వాహకులు, ఉపాధ్యక్షుడు కుల్వంత్ సింగ్ మాట్లాడుతూ బోలెస్వాస్కి కుటుంబానికి ప్రత్యేక సదుపాయలు అందిచ్చినా వారు అన్నింటిని తిరస్కరించి నేలపైనే పడుకొన్నారని తెలిపారు. వరదల్లో నిరాశ్రయులైన 750మందిపైగా ప్రజలకు ఆశ్రయం కల్పించామని, ఆహారం అందిచామన్నారు. ఈ కష్టకాలంలో వారు మా అతిథులు, వారిని అన్ని విధాలుగా అండగా ఉంటామని కుల్వంత్ సింగ్ తెలిపారు. -
ముంబై వరదలు ఎందుకు వచ్చాయి?
-
ముంబై వరదలు : మహింద్రా ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వరదలు ముంచెత్తాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన 288 మిల్లీమీటర్ల వర్షంతో ముంబై వీధులన్నీ అస్తవ్యస్తమయ్యాయి. 1997 ఆగస్టు నుంచి ఇంత భారీ మొత్తంలో వర్షం కురియడం ఇదే మొదటిసారి. భారీ వరదలతో ఫుల్‌గా ట్రాఫిక్ జామ్, ఎక్కడి వాహనాలు అక్కడ ఇరక్కపోవడం, రైళ్ల రాకపోకలపై నిషేధం, విమానాలు రద్దు వంటి వాటితో పౌర వ్యవస్థ స్తంభించింది. అయినప్పటికీ ప్రజలు ఒక్కరికొక్కరు సాయపడుతూ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. ఈ వరదలపై మహింద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహింద్రా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ముంబై ప్రజల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని తెలుపుతూ బీబీసీ ఆర్టికల్‌కు కౌంటర్‌గా ఆనంద్ మహింద్రా ఈ ట్వీట్ చేశారు. ''హోస్టన్ వరదలు: దొంగతనాలు, చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తూ రాత్రంతా కర్ఫ్యూ విధించారు'' అని బీబీసీ ఓ ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్‌ను ఉద్దేశిస్తూ.. ఆనంద్ మహింద్రా ఈ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో తన స్నేహితుడు ఒకరు ఎయిర్‌పోర్టుకు కారులో వెళ్తూ 5 గంటల పాటు వరదల్లో చిక్కుకుపోయారని, మురికివాడకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడిని బయటికి తీసుకొచ్చి టీ, బిస్కెట్లు అందించినట్టు మహింద్రా ట్వీట్ చేశారు. భారత్‌లో మానవత్వం బతికే ఉందని తెలుపుతూ మహింద్రా చేసిన ఈ ట్వీట్‌కు ట్విట్టరియన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఒక్కరి కోసం అన్ని మతాల తలుపులు తెరుచుకుంటాయని, ఇదే భారత్ అంటూ ఓ ట్విట్టర్ పేర్కొన్నారు. అంతేకాక ప్రతికూల పరిస్థితుల్లో ఒకరికి మరొకరు తోడుగా నిలుస్తారని, ఎలాంటి దొంగతనాలు, చొరబాట్లు ఇక్కడ ఉండవన్నారు. భారత్‌లో మంచి ప్రజలున్నారని, కానీ సిస్టమే సరిగా లేదని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. అమెరికాలో పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నారు. ఇలా ఆనంద్ మహింద్రా ట్వీట్‌కు ప్రతిస్పందనగా చాలామంది ట్వీట్లు చేశారు. -
ముంబై వరదలు ఎందుకు వచ్చాయి?
సాక్షి, ముంబై: భారీగా వర్షం పడితే నగర వీధులు కుంటలు, చెరవులు అవడం, పౌర జీవితం అస్తవ్యస్తం అవడం అందరికి అనుభవమే. ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడల్లా నెపాన్ని ప్రకతిపైకి నెట్టేయడం పాలకుల పని. అది హైదరాబాదైనా, ముంబై అయినా పెద్ద తేడా ఉండదు. కాకపోతే చిన్న చినుకుకే హైదరాబాద్ వీధులు కోనేరు అవుతాయి. కుండపోత వర్షాలకు ముంబై వీధులు చెరువులవుతాయి. ముంబై నగరంలో మంగళవారం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 288 మిల్లీమీటర్ల వర్షం కురియడంతో ప్రాణ నష్టం పెద్దగా జరుగకపోయినా నగరంలోని పౌర జీవితం అస్తవ్యస్తం అయింది. ఇందుకు బాధ్యత పూర్తిగా స్థానిక మున్సిపాలిటీ, పాలకులదే. 2005, జూలై 26వ తేదీన 24 గంటల్లో 944 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవడంతో ముంబై నగరం చిగురుటాకులా వణికిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. పక్కనే సముద్రం, నైసర్గిక స్వరూపం కారణంగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని పాలకులకు తెల్సిందే. అందుకనే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 1985లో బ్రిటిష్ ప్రముఖ కన్సల్టెంట్ వాట్సన్ హాక్షీని పిలిపించి గంటకు 50 మిల్లీ మీటర్ల వర్షం పడినా తట్టుకునేలా పటిష్టమైన నాలా వ్యవస్థకు ప్రణాళికను రూపొందించాలని కోరింది. దాన్ని అప్పుడు 'బృహముంబై స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ రిపోర్ట్' గా వ్యవహరించారు. 'బృమ్స్టావాడ్' అని ముద్దుగా షార్ట్ ఫామ్‌లో కూడా పిలుచుకున్నారు. అయితే అధికారులు సకాలంలో పని జరిగేలా చూడకపోవడంతో ఆ కన్సల్టెంట్ తన ప్రణాళికను రూపొందించి ఇవ్వడానికి ఎనిమిది ఏళ్లు పట్టింది. దాన్ని అరకొరగా అమలు చేయడానికి మున్సిపల్ పాలకులను 12 ఏళ్లు పట్టింది. ఫలితంగా 2005లో నగరాన్ని వరదలు మళ్లీ ముంచెత్తాయి. 2005 వరదల అనుభవంతో మున్సిపల్ రిటైర్డ్ ఇంజనీర్లతో స్థానిక మున్సిపాలిటీ 'ముంబై వికాస్ సమితి'ని ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటర్ డ్రైనేజీ వ్యవస్థను మెరగుపర్చేందుకు మరో ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఆదేశించింది. ఆ సమితి నగరంలో వర్షాలు పడే 121 ప్రాంతాలను గుర్తించింది. అందుకనుగుణంగా ఓ ప్రణాళికను రూపొందించింది. దాన్ని అమలు చేసేందుకు 616 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేసింది. వాటిలో 260 కోట్ల రూపాయలను మాత్రమే వెచ్చించి చిన్న చిన్న పనులనే స్థానిక మున్సిపాలిటీ పాలకులు అమలు చేశారు. వాటర్ పింపింగ్ స్టేషన్లను నిర్మించడం, రైల్వే కల్పర్ట్లను ఏర్పాటు చేయడం, కొత్తగా ఫ్లడ్ గేట్లను ఏర్పాటు చేయడం, పాత నల్లాలను మరింత లోతుగా, వెడల్పుగా పునరుద్ధరించడం లాంటి పనుల జోలికి వెళ్లలేదు. మీథి నది ఆక్రమణల తొలగింపునకు ప్రయత్నించలేదు. ముంబైకి సహజ సిద్ధమైన పలు నదులు, కాల్వలు ఉండడం వల్ల వరదల నుంచి త్వరగా కోలుకోగలుగుతుంది. లేకపోతే ప్రాణ, ఆస్తి నష్టాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఏటా 30వేల కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్ ఉండే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వరద సహాయక చర్యల కింద 200, 300 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది గానీ, వరదలను నివారించేందుకు ముందుగా ఖర్చు పెట్టడానికి మాత్రం ముందుకు రాదు.