ఎన్కౌంటర్ విచారణపై మునియమ్మళ్ అనుమానం
శేషాచలం ఎన్కౌంటర్ మీద ప్రభుత్వ విచారణ పట్ల మృతుడు శేషుకుమార్ భార్య మునియమ్మళ్ అనుమానం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ రోదిస్తూ న్యాయమూర్తిని ఆమె వేడుకున్నారు. అయితే.. శేషాచలం ఎన్కౌంటర్ మీద ప్రభుత్వ విచారణ పట్ల హైకోర్టు న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. చట్టానికి లోబడి ప్రభుత్వం అన్ని ఫార్మాలిటీస్ జరుపుతోందని, అనుమానాలకు తావులేదని ఆయన చెప్పారు.
అయితే.. పోస్టుమార్టం నివేదికను ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. సుప్రీం కోర్టు నిబంధనలకు లోబడి మృతదేహాలకు వీడియోగ్రఫీతో పోస్టుమార్టం నిర్వహించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. అనంతరం శేషాచలం ఎన్కౌంటర్ కేసు విచారణను కోర్టు గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.