ఎముకల క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించాలి
విజయవాడ, న్యూస్‌లైన్ : ఎముకల క్యాన్సర్(బోన్‌మ్యారో)ను తొలిదశలో గుర్తించడం ద్వారా రోగి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్ డాక్టర్ మురళీ సుందరం అన్నారు. మస్కులోస్కెలిటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బృందావన కాలనీలోని ఎ కన్వెన్షన్ హాలులో జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సులో బోన్‌మ్యారో అంశంపై ఆయన ఆదివారం డాక్టర్ కాకర్ల సుబ్బారావు గోల్డ్ మెడల్ ప్రసంగం చేశారు. బోన్‌మ్యారో ఎంఆర్ఐ గురించి సుందరం వివరించారు.
బోన్‌మ్యారోకు సంబంధించి పలు ఇమేజ్‌లు చూపిస్తూ వాటిలో క్యాన్సర్ కణాలను ఎలా గుర్తించాలో వివరించారు. అనంతరం జరిగిన టెక్నికల్ సెషన్స్‌లో మడమ ఎమ్ఆర్ఐకి అవసరమైన సాధనాలు, చికిత్సా విధానాలపై చంఢీఘర్‌కు చెందిన డాక్టర్ మహేష్ ప్రకాష్, మోకాలిలో లిగమెంట్లు వాటి ప్రాధాన్యత- కలిగే వ్యాధులు, చికిత్సా విధానాలపై అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్ అంకుర్‌షా వివరించారు. మోకాలు కీలులోని మృదులాస్థికి సంబంధించి వచ్చే ఇబ్బందులు, అరిగిపోవడం- చేయాల్సిన చికిత్సలపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ యన్. విజయభాస్కర్ విశ్లేషణాత్మకంగా చెప్పారు.
ఎక్స్‌టెన్సార్ ‘మెకానిజమ్ ఆఫ్ నీ’ అంశంపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ లలిత, పొస్టిరోలేటరర్ స్టెబిలైజింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ నీ అంశంపై ముంబాయికి చెందిన డాకట్ ్రమాలిని లావండీ, ఎముకపై లీజన్స్ వాటికి వచ్చే సమస్యలు చికిత్సా విధానాలు, కండరాల ఎంఆర్ఐ చికిత్సా విధానంపై అమెరికాకు చెందిన ప్రొఫెసర్ నోగా హరమతి, ఆస్టియో నెక్రోసిన్ ఇమేజింగ్, దీనివల్ల ఫలితాలను చెన్నైకు చెందిన గోవిందరాజ్‌లు వివరించారు. ఈ కార్యక్రమంలో సదస్సు నిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ దండమూడి శ్రీనివాస్, డాక్టర్ కులదీప్ తదితరులు పాల్గొన్నారు.