రక్షణ కోసం పాక్‌కు వెళ్లిన చిన్నారి 'మెస్సీ'
స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మోస్సీ చేసిన ఒక్క ట్విట్‌తో ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితుడైన ఆఫ్ఘన్ కుర్రాడు ముర్తజా అహ్మదీ(5)కు బెదిరింపులు ఎక్కువ అవ్వడంతో పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. మెస్సీ సాకర్ మ్యాచ్‌లో ధరించే టీ షర్ట్ తరహాలో ప్లాస్టిక్ కవర్‌తో రూపొందించిన షర్టును ధరించిన బుడతడు ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఎప్పటికైనా మెస్సీ అంతటి ఆటగాడిగా కావాలని ఎన్నో కలలు కంటున్న అతని కుటంబానికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో చేసేదేమీలేక ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్‌కు కుటుంబంతో సహా వెళ్లిపోయినట్టు బాలుడి తండ్రి ముహమ్మద్ ఆరిఫ్ ఆహ్మదీ తెలిపాడు.
ప్రస్తుతం క్వెట్టాలో ఉన్న వారు పాక్‌లో శాశ్వత ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 'రోజుకు 20 నుంచి 30 వరకు తెలియని వ్యక్తు నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి. నా కుమారుడికి ఖురాన్ నేర్పించకుండా ఫుట్‌బాల్ ఎందుకు నేర్పిస్తున్నావు' అని బెదిరంచేవారని బాలుడి తండ్రి ముహమ్మద్ ఆరిఫ్ ఆహ్మదీ తెలిపారు.
ప్రాణ రక్షణ కోసం మా కుటుంబంతో సహా ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్‌కు 40 రోజుల కింద వచ్చామని తెలిపాడు. బాలుడు ప్లాస్టిక్ కవర్‌తో తయారు చేసిన టీ షర్టు వేసుకున్న ఫోటోను మెస్సీ ట్విట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఓ అభిమాని పంపిన సమాచారంతో ఆ స్టార్ ప్లేయర్ ఆ ట్విట్ చేశారు. ఇరాన్లో ఓ బాలుడు అంటూ ..ట్విట్ చేశారు. కానీ, నిజానికి ఆ బాలుడు ఇరాన్‌కు చెందకపోయినా ఆ ఒక్క ట్విట్ తో ఫేమస్ అయిపోయాడు. ముర్తజా అహ్మదీ కుటుంబం అఫ్ఘనిస్తాన్ లోని మారుమూల జగోరీ అనే గ్రామంలో నివాసం ఉంటోంది.
పాకిస్తాన్లో తమ బంధువుల ఇంటికి సమీపంలో బాలుడి కుటుంబం ప్రస్తుతం ఉంటోంది.'ఐ లవ్ మెస్సీ ఎప్పటికైనా మెస్సీని కలుస్తా' అని ఇంటి బయట ఫుట్ బాల్ ఆడుతూ కనిపించిన బుడతడు అన్నాడు.