ముదపాక భూములపై న్యాయ విచారణకు డిమాండ్
వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మూర్తియాదవ్
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : ముదపాక భూములపై న్యాయ విచారణ చేపటా్టలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పీతల మూర్తియాదవ్ డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక రైతులకు ప్రభుత్వం ఢీ పట్టాలు అందజేసిందన్నారు. అయితే నడింపల్లి వెంకటరామరాజు(జలవిహార్ రామరాజు) అనే వ్యక్తి టీడీపీ నాయకుల అండదండలతో దౌర్జన్యంగా వాటిని లాకు్కన్నారని ఆరోపించారు.
ఈ విషయంపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. వారు నామమాత్రంగా కేసు నమోదుచేసి మమ అనిపించారన్నారు. న్యాయం కోసం ముదపాక రైతులు నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి మొర పెట్టుకుంటే విచారణ చేపటా్టలని పెందుర్తి పోలీసులను ఆదేశించారన్నారు. కానీ ఇంతవరకు ల్యాండ్ పూలింగ్‌కు పాల్పడిన వ్యక్తిపై చర్యలు చేపట్టలేదన్నారు. చివరకు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎమా్మర్వో ఇలా ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకున్నా ఏ అధికారి స్పందించకపోవడం శోచనీయమన్నారు. అలాగే దబ్బంద గ్రామంలో ఓ అధికారికి చెందిన 20 ఎకరాల భూమిని కూడా ఫోర్జరీ సంతకం పెట్టి ఇలాగే తీసుకున్నారని చెప్పారు.
అయినా అతనిపై కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. 290 జీవో రద్దు చేసి, 2013 భూసేకరణ చట్ట ప్రకారం అమలుచేసి రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఆక్రమణలకు పాల్పడిన వెంకటరామరాజు తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, మాజీ కార్పొరేటర్ పేర్ల విజయ్‌చందర్ పాల్గొన్నారు.