musalimadugu
-
సూపర్‌స్టార్ కృష్ణ మృతి.. ఆయన అత్తగారి గ్రామంలో విషాదఛాయలు
ఖమ్మం గాంధీచౌక్ : తెలుగు సినిమా రంగంలో అనేక రికార్డులు నెలకొల్పిన సినీ హీరో, సూపర్‌స్టార్ కృష్ణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో విడదీయలేని బంధం ఉంది. ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం ముసలిమడుగుకు చెందిన ఇందిరాదేవిని కృష్ణ వివాహమాడారు. అత్తగారి ఇంటికి వచ్చివెళ్లే క్రమంలో ఆయనకు ఖమ్మంతో అనుబంధం ఏర్పడింది. ఇక వందలాది సినిమాల్లో హీరోగా నటించిన కృష్ణకు జిల్లాలో అభిమానులు కూడా ఎక్కువే. హీరోగా గురిపు సాధించిన ఆయన అభిమానులు ఏర్పాటుచేసిన కార్యక్రమాలతో పాటు రాజకీయ నాయకుడిగానూ జిల్లాకు పలు సార్లు వచ్చారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో 2000 మార్చి 27న జిల్లా కళాకారుల ఐక్యవేదిక నిర్వహించిన మిలీనియం కళా పురస్కార ఉత్సవాల్లో కృష్ణ తన సతీమణి విజయనిర్మలతో కలిసి పాల్గొన్నారు. ఐక్యవేదిక ప్రతినిధులు వీ.వీ.అప్పారావు, డాక్టర్ నాగబత్తిని రవికుమార్ ఆధ్వర్యాన కృష్ణకు ఎన్టీఆర్ పురస్కారం, విజయనిర్మలకు మిలీనియం కళా పురస్కారం అందించి సన్మానించారు. అలాగే, ఖమ్మం కమాన్ బజార్లో ఏర్పాటు చేసిన విమల్ షోరూం ప్రారంభోత్సవానికి కృష్ణ వచ్చిన సమయాన ఉమ్మడి జిల్లా కృష్ణ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బాబాజీ, గౌరవ అధ్యక్షుడు తోట రంగారావు ఆయనకు జ్ఞాపిక అందించారు. (చదవండి: ఇకపై అవేవి ఇంతకు ముందులా ఉండవు, మిస్ యూ తాతయ్య: సితార ఎమోషనల్) సినిమా షూటింగ్లో కృష్ణతో అభిమానులు తోట రంగారావు, తదితరులు (ఫైల్) ఇక భద్రాచలం అడవులు, గోదావరి తీరంలో జరిగిన ఎన్కౌంటర్ సినిమా షూటింగ్లో నూ సూపర్ స్టార్ పాల్గొన్నారు. కాగా, మాజీ మంత్రి జలగం ప్రసాదరావుతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ప్రసాదరావు ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయాన ప్రచారానికి హాజరయ్యారు. నేతలతో పాటు అభిమానుల సంతాపం ఖమ్మం మయూరిసెంటర్ : సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు తెలి యగానే ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు ఆయన చిత్రపటాల వద్ద నివాళులర్పించగా కొందరు కృష్ణకు కడసారి వీడ్కోలు పలికేందుకు హైదరాబాద్ వెళ్లారు. అలాగే, సీఎం కేసీఆర్‌తో కలిసి కృష్ణ నివాసానికి వెళ్లిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించడమే కాక మహేష్‌బాబు, కుటుంబీకులను ఓదార్చారు. ఇక ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా కృష్ణ మృతిపై సంతాపం ప్రకటించారు. (చదవండి: సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?) -
ఉపాధ్యాయుడిని చితకబాదారు
ఖమ్మం: వైరా మండల పరిధిలోని ముసలిమడుగు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీచర్‌పై గురువారం దాడి జరిగింది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఇన్చార్జ్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె. వెంకటేశ్వర్లు గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన నర్సింహారావు అనే వ్యక్తి టీచర్‌ను చితకబాదాడు. మధ్యాహ్నభోజనం వండే విషయంలో ఇటీవల జరిగిన వివాదమే దాడికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాఠశాలల బలోపేతమే లక్ష్యం
జెడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత ముసలిమడుగు(వైరా) : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. మంగళవారం మండల పరి«ధిలోని ముసలిమడుగు గ్రామంలో ఎన్ఆర్ఐ పౌండేషన్ పేరెంట్ అసోసియెషన్ కమిటీ సభ్యుడు కొండబోలు రవి, బెల్లం మధుచౌదరి, కిషన్ స్వరూప్‌లు పాఠశాలకు డిజటల్ టీవీని అందజేశారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ డిజటల్ తరగతులు నిర్వహించటంవల్ల విద్యార్థులకు బోధనలో ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం తరగతులు ప్రవేశపెట్టిందని, త్వరలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ పౌండేషన్ సభ్యులను అభినందించారు. కార్యక్రమం లో జెడ్పీటీసీ సభ్యురాలు బొర్రా ఉమాదేవి, ఎంపీపీ బొంతు సమత, సర్పంచ్ చింతనిప్పు కరుణాకర్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎస్ఎంసీ చైర్మన్ చిర్రా సుజాత, నాయకులు బొర్రా రాజ శేఖర్, సూతకాని జైపాల్, కృష్ణార్జునరావు, హెచ్ఎం వెంకటేశ్వరరావు తదితరులున్నారు. -
పాఠశాలల బలోపేతమే లక్ష్యం
జెడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత ముసలిమడుగు(వైరా) : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. మంగళవారం మండల పరి«ధిలోని ముసలిమడుగు గ్రామంలో ఎన్ఆర్ఐ పౌండేషన్ పేరెంట్ అసోసియెషన్ కమిటీ సభ్యుడు కొండబోలు రవి, బెల్లం మధుచౌదరి, కిషన్ స్వరూప్‌లు పాఠశాలకు డిజటల్ టీవీని అందజేశారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ డిజటల్ తరగతులు నిర్వహించటంవల్ల విద్యార్థులకు బోధనలో ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం తరగతులు ప్రవేశపెట్టిందని, త్వరలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ పౌండేషన్ సభ్యులను అభినందించారు. కార్యక్రమం లో జెడ్పీటీసీ సభ్యురాలు బొర్రా ఉమాదేవి, ఎంపీపీ బొంతు సమత, సర్పంచ్ చింతనిప్పు కరుణాకర్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎస్ఎంసీ చైర్మన్ చిర్రా సుజాత, నాయకులు బొర్రా రాజ శేఖర్, సూతకాని జైపాల్, కృష్ణార్జునరావు, హెచ్ఎం వెంకటేశ్వరరావు తదితరులున్నారు.