వివాదంలో ఓలా, ఫౌండర్స్‌పై కేసు
బెంగళూరు: ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్ ఓలా వివాదలో ఇరుక్కుంది. కాపీరైట్ చట్టం ఉల్లంఘించిన ఆరోపణలతో బెంగళూరు పోలీసులు ఓలా ఫౌండర్స్‌పై కేసున మోదు చేశారు. ఓలా ప్లే ప్లాట్‌ఫారమ్ ద్వారా చలనచిత్ర పాటలను చోరీ చేసి స్ట్రీమింగ్ చేసినందుకు బెంగళూరుకు చెందిన రికార్డింగ్ కంపెనీ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఓలా ప్లే ప్లాట్‌ఫాం ద్వారా పైరేటెడ్ సినిమా పాటలను వాడుతున్నారని మ్యూజిక్ సంస్థ లహరి రికార్డింగ్ కంపెనీ లిమిటెడ్. ఓలా మాతృ సంస్థ ఎఎన్ఐ టెక్నాలజీస్ ప్రయివేటు లిమిటెడ్‌పై ఫిర్యాదు చేసింది. తాము ఆడియో హక్కులను కొనుగోలు చేసిన కన్నడ , తెలుగు సినిమాల నుండి పాటలను డౌన్లోడ్ చేసుకుంటున్నారనీ ఆరోపించింది. కర్ణాటక, ఢిల్లీ, కోల్‌కతా తమిళనాడులో వీటిని అక్రమంగా వినియోగిస్తున్నారని మ్యూజిక్ కంపెనీ ఆరోపించింది. దీంతో పోలీసులు ఓలా కార్యాలయంపై దాడి చేసి, పాటలను డౌన్లోడ్ చేయడానికి, నిల్వ చేయడానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎఎన్ఐ టెక్నాలజీస్ లిమిటెడ్, ఓలా ఫౌండర్స్ భవిష్ అగర్వాల్ , అంకిత్ భతీపై కేసు నమోదు చేశారు.