ఉబెర్ డ్రైవర్లకు గుడ్ న్యూస్!
యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందిస్తున్న ఉబర్, తన డ్రైవర్లకు మ్యూజిక్ ఆఫర్ చేయనుంది. దీనికోసం ఆన్ లైన్ రేడియో స్టేషన్ పండోరాతో జతకట్టింది. రైడింగ్ సమయాల్లో తేలికగా మ్యూజిక్ ను ఆలకించేందుకు వీలుగా తమ డ్రైవర్లకు కోసం ఈ ఆన్ లైన్ స్టేషన్ తో జతకట్టినట్టు ఉబర్ సోమవారం వెల్లడించింది. ఈ ఒప్పందం వల్ల రైడింగ్ సమయంలో డ్రైవర్లకు ఎలాంటి అలసట లేకుండా ఉండటంతో పాటు, ఆటోమోటివ్ మార్కెట్లో పండోరా ఉనికి చాటుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో పాటు పండోరా ఆపరేట్ చేసే ఆన్ లైన్ మ్యూజిక్ సేవల్లో ఈ ప్రోగ్రామ్ నేటి(సోమవారం) నుంచి ప్రారంభమవుతుందని ఉబర్ పేర్కొంది. మొదటి ఆరు నెలలు ఎలాంటి యాడ్ ల లేకుండా ఈ ఆఫర్ ను డ్రైవర్లకు అందిస్తుంది.
అమెరికాలోని 450,000మంది యాక్టివ్ ఉబర్ డ్రైవర్లకు పండోరా మ్యూజిక్ సేవలు అందించేందుకు రెడీ అయింది. అయితే ఇంతకముందే పాపులర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ స్పాటిఫై తో డీల్ కుదుర్చుకుని రైడింగ్ సమయంలో సెలక్ట్ మ్యూజిక్ లను ఉబర్ తన డ్రైవర్లకు అందించింది. ప్రస్తుతం మ్యూజిక్ అనుభవాన్ని పునురుద్ధరించిన నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ ను పండోరా ఆన్ లైన్ రేడియో స్టేషన్ తో కలిసి పునః ప్రారంభించింది. దీంతో ఉబర్ డ్రైవర్లు, ప్యాసెంజర్లు రైడింగ్ సమయంలో ఇక నుంచి తేలికగా మ్యూజిక్ ను ఆలకించవచ్చు. చాలామంది పండోరా శ్రోతలు ఉచిత యాడ్ లతో మ్యూజిక్ ను ఆస్వాదిస్తున్నారు. అయితే ఆన్ డిమాండ్ సర్వీసును ప్రారంభించాలని కాలిఫోర్నియా చెందిన ఈ కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.