శివలింగమందిరంలో మ్యూజియం ప్రారంభం
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి సమీపంలో నిర్మించిన శివలింగ మందిరం అంతర భాగంలో రతన్దాదా ఆధ్వర్యంలో సుమారు రూ.కోటి వెచ్చించి ఏర్పాటు చేసిన మ్యూజియంను శనివారం ప్రారంభించారు. ప్రశాంతి గ్రామంలో నిర్మించిన 75 అడుగుల ఎత్తైన శివలింగ మందిరంలోని ఈ మ్యూజియం చూపరులను ఆకట్టుకుంటోంది. స్వర్గంలో దేవతలు కొలువుదీరిన విధంగా బొమ్మల ఆకృతులను ఇక్కడ ఏర్పాటు చేశారు. శివలింగం, శ్రీరామ పట్టాభిషేకం, వేదాల పఠనం, శ్రీకృష్ణుడు గోపికలతో విహరిస్తున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.