ముస్కాన్.. ఆకర్షించే అందం, ఆలపించగల స్వరం ఆమె సొంతం
ముస్కాన్.. పేరుకు తగ్గట్టే మొహం మీద చిరునవ్వు చెరగనీయదు. అదొక్కటే ఆ అమ్మాయి ప్రత్యేకత అనుకుంటే పొరపాటే. ఆలపించగల స్వరం.. ఆకర్షించగల అందం ఆమె సొంతం. పూర్తి పేరు ముస్కాన్ జాఫ్రీ. నేపథ్య గాయని.. వాయిస్ ఆర్టిస్ట్.. నటి.
►పుట్టింది, పెరిగింది ముంబైలో. సుగ్రా, జగ్దీప్.. ఆమె తల్లిదండ్రులు.
► 2016లో ‘మీడియం’ అనే షార్ట్ ఫిల్మ్‌తో స్క్రీన్ మీద పరిచయం అయింది.
► అంతకుముందే గాయనిగా సుపరిచితం ఆమె. ఓ వైపు నటనా అవకాశాలు వెదుక్కుంటూనే ఇంకో వైపు డబ్బింగ్లోనూ ప్రతిభ చాటుకోవడం మొదలుపెట్టింది. తాజా విడుదల భీష్మతో సహా ఇప్పటివరకు ఇరవై సినిమాల్లో ప్రముఖ పాత్రలకు తన గొంతును అరువిచ్చింది. కొన్ని యానిమేషన్ చిత్రాల్లోనూ డబ్బింగ్ చెప్పింది.
► థియేటర్లో ప్రవేశించి తన నటనాకౌశలాన్ని ప్రదర్శించింది. ఆ వేదిక ముస్కాన్‌కు బాగా కలిసొచ్చింది. వెబ్ సిరీస్‌లో నటించే చాన్స్‌లను తెచ్చిపెట్టింది. వాటిల్లో ది గుడ్ కర్మా హాస్పిటల్, నోబుల్మన్, మిస్మ్యాచ్డ్.. మచ్చుకు కొన్ని.
► తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ది ఫేమ్ గేమ్’తో ముస్కాన్ పేరు మరోసారి మారుమోగుతోంది. అందులో మాధురీ దీక్షిత్‌కి కూతురుగా నటించింది. పలువురినీ మెప్పిస్తోంది.
► పాటలు, డబ్బింగ్, నటనే కాకుండా చిత్రకళ అంటే కూడా ముస్కాన్‌కు ప్రాణం.
► ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా బొమ్మలేస్తూ సేదతీరుతుంది.
నాకు మా నాన్నే స్ఫూర్తి, ప్రేరణ అన్నీ. ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాను. నన్ను చూసి నాన్న గర్వపడేలా చేయాలనేదే నా లక్ష్యం. – ముస్కాన్ జాఫ్రీ