విద్యార్థుల ముంగిట ‘సెట్’ తుపాన్!
ఇంటర్ పరీక్షలు, ఎంసెట్ అడ్మిషన్స్ జరిపే అధికారం ఏ ప్రభుత్వానికి ఉందని తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నట్టు సెట్స్ వేరు వేరుగా నిర్వహించుకోవటమే ఉత్తమం.
రాష్ట్ర విభజన తర్వాత అనేక విషయాల్లో మాదిరే విద్యను కూడా వివాదాస్పదం చేస్తున్నా రు పక్కింటి సోదరులు. గత కొంతకాలంగా విద్యపై వాదో పవాదాలు, ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. రెండు ప్రశ్న ల చుట్టూ ప్రస్తుత వివాదం నడుస్తోంది. 1. ఇంటర్ పరీ క్షలు ఏ రాష్ట్రం నిర్వహించాలి? 2. ఎంసెట్ కామన్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహించి, అడ్మిషన్స్ జరిపే అధికారం ఏ రాష్ర్ట ప్రభుత్వానికి ఉంది? వీటి చుట్టూ సాగుతున్న చర్చల్లో లాభనష్టాల వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు, ఎంసెట్ టెస్ట్ నిర్వ హిస్తే ఏ రాష్ట్ర విద్యార్థులకు నష్టం? ఎవరికి లాభం? అసలు ఇది లాభనష్టాల సమస్యకాదు. నిజానికి ఇది అధికారాల సమస్య. బాధ్యతల సమస్య. పదేళ్ల వరకు వీటి నిర్వహణలో సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నదే ఆలోచించాలి.
ముందుగా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్లు 75, 95, 103లను చూడాలి. సెక్షన్ 75 ప్రకారం పై చట్టంలో పదవ షెడ్యూల్లో చేర్చిన సంస్థలు, అవి తెలం గాణలో ఏర్పాటై ఉంటే తెలంగాణ వారితోపాటు ఆంధ్ర ప్రదేశ్ వాసులకూ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంస్థలైతే ఆ రాష్ర్ట ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలకు కూడా, అవి భక్త ఆంధ్రప్రదేశ్‌లో (నిర్ధారిత రోజుకు ముందు) అం దించిన సేవలను/సౌకర్యాలను విభజన తర్వాత కూడా ఇరురాష్ట్రాల ప్రజలకు ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుం డా అందించాలి. అందుకోసం రెండు రాష్ర్ట ప్రభుత్వాలు ఇరువురికీ ఆమోదయోగ్యమైన కాలం వరకు సంవత్స రంలోగా షరతులతో కూడిన ఒప్పందానికి రావాలి.
సెక్షన్ 95 ప్రకారం, విభజన రాష్ట్రాలలో విద్యార్థు లకు నాణ్యమైన ఉన్నత విద్యలో సమాన అవకాశాల కల్పన అనే హామీ కోసం ఆర్టికల్ 371డీని అనుసరించి అమలులో ఉన్న అడ్మిషన్ కోటాలు ఇక ముందు కూడా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రైవేట్ సంస్థలతో పాటు సాంకేతిక మెడికల్ కాలేజీలలో కూడా పది సంవత్సరాల పాటు కొనసాగుతాయి. అయితే ఈ కాలమంతా ప్రస్తుతం అమలులో ఉన్న అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సెక్షన్ 103ని చూస్తే, సంవి ధానపరమైన కార్యకలాపాల నిమిత్తం అథారిటీస్‌ని ఏర్పాటు చేసుకోవటానికీ, అధికారులను నియమించుకోటానికీ ఇరు రాష్ట్రాలకు అధికారాలను కట్టబెట్టింది.
దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్న సీట్లలో తెలంగాణ వాళ్లకు 85 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సీట్లలో ఆంధ్రప్రదేశ్ వాళ్లకు 85 శాతం సీట్లు. రెండు రాష్ట్రాలలో 15 శాతం సీట్లు ర్యాంకు ఆధారంగా అందరికీ అందుబాటులో ఉంచాలి. తెలంగాణ ప్రభు త్వం వాదన కూడా ఇదే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యం లోనే ఎంసెట్ నిర్వహించాలనీ, ఆ మండలికే ఆ అధికా రం ఉందని వాదిస్తుంది.
రెండు రాష్ట్రాలకూ కలిపి ఒకే సెట్ నిర్వహిస్తామ నటం కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతుంది. పది సంవ త్సరాలు ఉమ్మడి సెట్స్ పద్ధతి కొనసాగిస్తామంటే పది సంవత్సరాలు వివిధ కోర్సుల్లో సిలబస్ మరియు పరీ క్షల పద్ధతి మార్చకుండానైనా ఉండాలి లేదా మారిస్తే రెం డు రాష్ట్ర ప్రభుత్వాలు సిలబస్‌లో, పరీక్షల నిర్వహణలో ఒకే పద్ధతి అవలంబించాలి. సిలబస్‌ను పదేళ్లు మార్చ కుండా ఉండటం సాధ్యమా? అట్లా అయితే నాణ్యమైన ఉన్నత విద్య ప్రశ్నార్థకం కాదా. మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలరా? తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సిలబస్ మార్పు ప్రక్రియ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఏమాలోచిస్తుం దో తెలవదు. ఇటువంటి వైవిధ్యపూరిత నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడి సెట్ సాధ్యం కాదు. అనేక సాంకేతిక సమస్యలతో చికాకులు పడటం, కొట్లాడుకో వటం తప్పదు.
ఇంటర్ పరీక్షల్ని రెండు రాష్ట్రాలు విడివిడిగా నిర్వ హించుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ మేరకు పరీక్షల ప్రక్రియను ప్రారంభించాయి కూడా. ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే, ఇంటర్లో ఒక విద్యార్థి సాధించిన మార్కుల్లోంచి 25 శాతం మార్కులు సెట్లో ఆ విద్యార్థి పొందిన మార్కులకు కలుస్తాయి. అంటే సెట్ మార్కులు 75కు 25 ఇంటర్ మార్కులు (శాతంలో) కలిపితే ఆ విద్యార్థి ర్యాంకు నిర్ణయమవు తుంది. దాని ఆధారంగానే సదరు విద్యార్థికి కౌన్సెలింగ్‌లో సీటు ఖరారవుతుంది. దీనర్థం, 25 శాతం అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైనట్టే.
ఇంటర్ పరీక్షలు ఎవరికి వారు నిర్వహిస్తే లేని నష్టం ఎంసెట్ వేరు వేరుగా నిర్వహిస్తే వచ్చే నష్టమేమిటో? సెట్స్ ఎవరు నిర్వహిం చినా, అడ్మిషన్లు ఎట్లా జరిపినా 85 శాతం సీట్లు రిజర్వ్డ్ 15 శాతం సీట్లు ఓపెన్ అనే రూల్‌లో ఎట్లాంటి మార్పూ ఉండదు గదా. ప్రస్తుతం కావాల్సింది ఒకరి పట్ల ఇంకొ కరికి నమ్మకం.
ముందు ముందు ఏ సమస్యలూ రాకుండా ఉండాలంటే తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నట్టు సెట్స్ వేరు వేరుగా నిర్వహించుకోవటం అన్నివిధాలా ఉత్తమం. అడ్మిషన్స్ కూడా 371డీ ప్రకారం (85:15) జరు పుకుంటే మంచిది. అయితే విభజన చట్టంలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి అడ్మిషన్ ప్రక్రి య కొనసాగుతుందని ఉన్నది కనుక రెండు ప్రభుత్వాలు ఉమ్మడిగా ఒక ఏర్పాటు చేసుకోవచ్చు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతం వీడాలి.
-ప్రొపెసర్ ముత్యంరెడ్డి కట్టా
(వ్యాసకర్త పూర్వ రిజిస్ట్రార్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్లగొండ మొబైల్: 8790321818)