బంపర్ ఆఫర్..
కిలో మటన్ రూ. 200లు
చికెన్ రూ. 100
ఉట్నూర్ : పస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ. 200లు, కిలో మటన్ ధర రూ. 400లు పలుకుతుంది. అయితే మండల కేంద్రంలో కొందరు మటన్, చికెన్ దుకాణదారులు శుక్రవారం ఏజెన్సీలో బడుగ పండుగ సందర్భంగా బంఫర్ ఆఫర్ ప్రకటించారు. కిలో చికెన్ ధర రూ. 100లు, కిలో మటన్ ధర రూ. 200లుగా ప్రకటించి విక్రయించారు. దీంతో మటన్, చికెన్ కొనుగోలు కోసం జనం ఎగబడ్డారు. బడుగ పండుగకు తోడు ఇన్ని రోజులు శ్రావణమాసంతో మాంసహారానికి దూరంగా ఉన్న వారు బంఫర్ అఫర్ను బాగా ఉపయోగించుకున్నారు.