Muzuvani vote
-
బీజేపీకి పెద్ద సవాల్‌గా ఎదిగాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీకి రాజకీయాల్లో అతిపెద్ద సవాల్‌గా, కొరకరాని కొయ్యలా తయారయ్యాం కాబట్టే ఆప్‌పై బీజేపీ అన్ని వైపుల నుంచి దాడులు చేస్తోందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల్లో తన ప్రభుత్వంపై పెట్టుకున్న విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం కేజ్రీవాల్ ప్రసంగిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే గెలుపు కావచ్చు. కానీ 2029 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం దేశానికి బీజేపీ నుంచి విముక్తి కలి్పస్తాం. ఆ బాధ్యత ఆప్ తన భుజస్కంధాలపై వేసుకుంది. సభలో ఆప్కే మెజారిటీ ఉందనేది స్పష్టం. అయితే ఆప్ ఎమ్మెల్యేలకు ఎరవేసి తమ వైపు లాక్కుని, ఆప్ సర్కార్‌ను కూల్చేద్దామని బీజేపీ కుట్ర పన్నింది. అందుకే ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది’’ అని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. తర్వాత విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గింది. -
మహారాష్ట్రలో ‘ద్రవ్య’ బిల్లుపై డివిజన్
2014 ఏప్రిల్ 16న మహారాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్ సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లును కేవలం మూజువాణి ఓటుతోనే సరిపెట్టాలని, డివిజన్ (అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను స్పష్టంగా నిర్ధారించడానికి వీలుగా సభలో నిర్వహించే ఓటింగ్ ప్రక్రియ)కు అవకాశం లేదంటూ ఏపీ శాసనసభలో బుధవారం అధికార పక్షం చేసిన వాదనలో వాస్తవం లేదని తేలిపోయింది. ఈ బిల్లుపై డివిజన్‌కు అవకాశం కల్పిం చడం.. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర శాసనసభలో నూ జరగలేదని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన దాంట్లోనూ నిజం లేదని తేలింది. 2014 ఏప్రిల్ 15న మహారాష్ట్ర శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుకు సభ మూజువాణి ఓటు తో ఆమోదం తెలిపిన తర్వాత.. అప్పటి ప్రతిపక్షం (బీజేపీ, శివసేన) డివిజన్ కోరింది. అప్పటి స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్.. ప్రతిపక్షం డిమాండ్ కు సానుకూలంగా స్పందించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్‌కు అంగీకరించారు. బిల్లుకు అనుకూలంగా 105, వ్యతిరేకంగా 72 ఓట్లు వచ్చాయి. బిల్లుకు ఆమో దం లభించిందని స్పీకర్ ప్రకటించారు.