కమ్యూనిస్టు నేత ఎంవీ రాఘవన్ కన్నుమూత
కన్నూర్(కేరళ): ప్రముఖ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ మంత్రి ఎం.వీ. రాఘవన్(81)ఆదివారం కన్నూర్ జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందారు. రాఘవన్ మృత దేహానికి సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిప్రాయ భేదాల కారణంగా సీపీఎం ఆయనను 1985లో బహిష్కరించింది. 1986లో ఆయన కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీని స్థాపించారు. అప్పట్నుంచి ఆ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్‌లో భాగస్వామిగా కొనసాగుతోంది.
చేనేత కార్మికుడైన రాఘవన్ తొలుత ట్రేడ్‌యూనియన్ నాయకుడుగా, ఆ తరువాత శక్తిమంతమైన నేతగా ఎదిగారు. రాఘవన్ ఏడు సార్లు శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా ఉన్నారు.
**