ఉపలోకాయుక్త కృష్ణాజీరావు పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: ఉపలోకాయుక్త ఎంవీఎస్ కృష్ణారావు మంగళవారం పదవీ విరమణ చేశారు. అంకితభావం, నిజాయితీతో విధులు నిర్వహించిన కృష్ణాజీరావు న్యాయవ్యవస్థకు వన్నె తెచ్చారని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి ప్రశంసించారు. హైదరాబాద్‌లోని లోకాయుక్త ఆవరణలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కృష్ణాజీరావు జిల్లాల్లో పర్యటిస్తూ ఫిర్యాదులు స్వీకరించేవారని చెప్పారు. అన్యాయానికి గురైన అట్టడుగువర్గాల వారికి మేమున్నామంటూ భరోసా ఇచ్చేవారన్నారు.
ఆప్యాయతకు కృష్ణాజీరావు మారుపేరని ఆయనకు సమీప బంధువు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. రిజిస్ట్రార్ దయాకర్‌రెడ్డి, డెరైక్టర్ (దర్యాప్తు) నర్సింహారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు న్యాయాన్ని చేరువచేసి ప్రాంతీయ స్థాయిలో లోకాయుక్తకు కృష్ణాజీరావు గుర్తింపు తెచ్చారని అన్నారు. అనంతరం కృష్ణాజీరావును జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డెరైక్టర్ (లీగల్) ఐజాక్ ప్రభాకర్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీ పార్థసారథి, అధికారులు రమేష్, శేఖర్‌రెడ్డి, దర్యాప్తు అధికారి తాజుద్దీన్, లక్ష్మీనారాయణ, జయరామ్, అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.