నిద్రపుచ్చడానికో యాప్!
టొరంటో: ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య నిద్రలేమి. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించాక కూడా ఏవేవో ఆలోచనలతో చాలా సమయం వరకు నిద్ర పట్టదు. ఈ కష్టాలను తొలగించడానికి ఒక యాప్ను కనుగొన్నారు కెనడాలోని సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు లుస్ బియోడిన్.
ఈయన సృష్టించిన యాప్, శరీరంతో అనుసంధానమై పడుకున్నప్పుడు మనసులోకి వచ్చే విషయాలను నియంత్రించి మెదడును ఆలోచనా రహితంగా మారుస్తుందట. ‘మై స్లీప్ బటన్’ అనే పేరుతో దీన్ని త్వరలోనే విడుదల చేస్తారు.