బకాసుర బర్గర్
పరిపరి శోధన
మామూలుగా బర్గర్లు ఎంత ఉంటాయి? అరచేతిలో ఇమిడిపోతాయి. మహా అయితే దోసిట్లో ఒదిగిపోతాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది భారీగా తయారు చేసిన బర్గర్ శిల్పమేమీ కాదు, నిజమైన తినదగ్గ బర్గరే! దీని బరువు ఎంతంటారా? కేవలం 84.3 కిలోలు మాత్రమే.
అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రం సౌత్గేట్లో ‘మ్యాలీస్ స్పోర్ట్స్ గ్రిల్ అండ్ బార్’ 2009లో ఈ బకాసుర బర్గర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. అమ్మకానికి అందుబాటులో ఉన్న అతిపెద్ద బర్గర్‌గా గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కింది. దీని ధర ఎంతో కాదు, 400 డాలర్లు (సుమారు రూ.27,400) మాత్రమే!