బకాసుర బర్గర్ | Bakasura Burger | Sakshi
Sakshi News home page

బకాసుర బర్గర్

Published Thu, Feb 25 2016 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

బకాసుర బర్గర్

బకాసుర బర్గర్

పరిపరి  శోధన
 
మామూలుగా బర్గర్లు ఎంత ఉంటాయి? అరచేతిలో ఇమిడిపోతాయి. మహా అయితే దోసిట్లో ఒదిగిపోతాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది భారీగా తయారు చేసిన బర్గర్ శిల్పమేమీ కాదు, నిజమైన తినదగ్గ బర్గరే! దీని బరువు ఎంతంటారా? కేవలం 84.3 కిలోలు మాత్రమే.

అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రం సౌత్‌గేట్‌లో ‘మ్యాలీస్ స్పోర్ట్స్ గ్రిల్ అండ్ బార్’ 2009లో ఈ బకాసుర బర్గర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. అమ్మకానికి అందుబాటులో ఉన్న అతిపెద్ద బర్గర్‌గా గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కింది. దీని ధర ఎంతో కాదు, 400 డాలర్లు (సుమారు రూ.27,400) మాత్రమే!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement