మహిళలపై దాడులను అరికట్టాలి
శామీర్‌పేట్, న్యూస్‌లైన్: మహిళా ఉద్యోగులపై ఆయా కార్యాలయాల్లో చోటుచేసుకుంటున్న దాడులను అరికట్టేందుకు చట్టాలు తీసుకురావడంతో పాటు అవి సక్రమంగా అమలయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బెంగళూర్ నేషనల్ లా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్ఎల్ మిత్రా అభిప్రాయపడ్డారు. మహిళలపై పెరుగుతున్న నేరాలపై శనివారం మండలంలోని నల్సార్ లా యూనివర్సిటీలో వివిధ కంపెనీల హెచ్ఆర్లతో చర్చాగోష్టి నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మిత్రా ప్రసంగించారు. ఈ తరం మహిళలు వేటి నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కొంతమంది మహిళలు తమకు జరిగిన అన్యాయాలను ఎదుర్కొంటున్న తీరు అభినందించదగిందని కొనియాడారు. సమాజంలో వనితలను చులకనగా చూడటంతో పాటు వారిపై పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలన్నారు. అంతకుముందు నల్సార్ లా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా ప్రారంభోపన్యాసం చేశారు. మహిళలు తమకు తాముగా శక్తిని కూడగట్టుకుని సమస్యలను ఎదుర్కొనే విధంగా చట్టాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో వారు విఫల మవుతున్నారని పేర్కొన్నారు.
దీనికి కారణం వారిపై పెత్తనం చెలాయిస్తున్న కుటుంబ యజమానులు, సమాజం లోని నాయకులు, ఇతర సంస్థల యాజమాన్యం అని చెప్పారు. కేవలం చట్టాలు రూపొందిం చడమే కాకుండా.. ప్రజలో ్లపరివర్తన తీసుకురావడం ప్రధానమని ఆయన అభిప్రాయపడ్డారు. అడిషినల్ సోలిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (ఏఎస్జీఐ) ప్రొఫెసర్ ఇందిరా జయ్సింగ్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ చదువుతున్న కాలంలో తనకు జరిగిన అన్యాయాన్ని ఉదహరించారు.
ఆ సమస్యను తాను ఎలా ఎదుర్కొన్నారో వివ రించారు. దానిపై ప్రధానమంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు. నల్సార్ లా ప్రొఫెసర్ అమితా దండా ప్రసంగిస్తూ .. మహిళలకు వారి హక్కులు గురించి అవగాహన కల్పించాలని అన్నారు. వారికి జరుగుతున్న అన్యాయాలను మౌనంగా సహించొద్దన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ కంపెనీల హెచ్ఆర్లు, నల్సార్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.