నేడు ‘నా ఫీజులు దొబ్బాయ్’ ఆడిషన్స్
ఖమ్మం కల్చరల్ : రమాదేవి ఆర్ట్ క్రియేషన్స్ పతకంపై జిల్లాకు చెందిన విష్ణువర్దన్బాబు నిర్మాతగా నిర్మించబోతున్న ‘నా ఫీజులు దొబ్బాయ్’ చిత్రం షూటింగ్ జూలై రెండో వారంలో ఖమ్మంలో ప్రారంభమవుతుందని దర్శకుడు బెల్లన్న సంతోష్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
వైజాగ్‌కు చెందిన అమాన్పాండే హీరోగా నటిస్తున్నాడని, సినిమాలో నటించేందుకు సీనియర్ నటీనటులను ఎంపిక చేసినప్పటికి తెలంగాణ ప్రాంతంలో మరి కొంత మంది నూతన కళాకారులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల 21నుంచి నాలుగు రోజులపాటు వరుసగా నగరంలోని పాత వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న ఆఫీసులో ఆడిషన్స్‌ను ఏర్పా టు చేసినట్లు తెలిపారు. సమావేశంలో దర్శకత్వ పర్యవేక్షకుడు బండ్ల వెంకటేశ్వరరావు, స్థానిక కళాకారులు పాషా, కోటి పాల్గొన్నారు.