ఊగిసలాడే...
మనసులో ప్రేమ ఉంటే మనిషి ఎంత దూరంలో ఉన్నా దగ్గర చేస్తుందనే కాన్సెప్ట్‌తో రూపొందనున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే’. రావంత్, పావని జంటగా కెమెరామ్యాన్ ధనుంజయ్ దర్శకత్వంలో పళ్లా రమణ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘జనవరి 10 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, చీరాల ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్లో టాకీ పార్ట్ పూర్తి చేసి, పాటలను గోవా, అరకు ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. యువహృదయాల ఊగిసలాటని ఇందులో ఆవిష్కరించనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, సమర్పణ: పళ్లా శారదా రమణ.