మంచిర్యాలలో న్యాక్ బృందం
మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం బుధవారం ఉదయం సందర్శించింది. కళాశాలలో వసతులు, సమస్యలు, అధ్యాపక బృందం, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను న్యాక్ అధికారులు సేకరించారు. తరగతి గదులు, ల్యాబ్‌లను పరిశీలించిన అధికారులు ప్రిన్సిపల్‌తో చర్చలు జరుపుతున్నారు. ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచేందుకు న్యాక్ కృషి చేస్తుంది. ఈ సంస్థ సిఫారసుల ఆధారంగా యూజీసీ కళాశాలలకు గ్రాంట్ మంజూరు చేస్తుంది.