బ్లేడ్ వద్దు.. కాగితంతో గీసుకోండి..
గెడ్డం గీసుకోవడానికి ఏం కావాలి? బ్లేడ్ కావాలి. ఎవరైనా మీకు కాగితంలో గెడ్డం గీసుకోమని చెబితే.. వింతగా చూస్తారు కదూ.. ఇకపై అలాంటి లుక్కులివ్వద్దు. ఎందుకంటే.. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన డిజైనర్ నదీం హైదరీ నీటిలో తడవని పేపర్‌తో రేజర్లను తయారుచేశారు. ఇవి మామూలు బ్లేడ్లలాగానే.. గెడ్డం గీసుకోవడానికి ఉపయోగపడతాయని ఆయన చెబుతున్నారు.
ప్లాస్టిక్‌తో కాకుండా.. కాగితంతో చేసినందున.. ఈ ‘పేపర్ కట్’ రేజర్ పర్యావరణానికి అనుకూలమైనదని.. రీసైక్లింగ్ కూడా చాలా సులువని అంటున్నారు. భవిష్యత్తులో ప్లాస్టిక్ రేజర్ల స్థానాన్ని ఇది ఆక్రమిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి చూసుకోకుంటే.. కాగితపు అంచుల వల్ల మన చేతులు కూడా కోసుకుంటాయని.. కాగితానికి ఆ శక్తి ఉందని నదీం గుర్తుచేస్తున్నారు.