మృత్యువుతో పోరాటం..
చిన్నారి వైద్యానికి రోజూ రూ. 50 వేల ఖర్చు
దాతల సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): సరదాగా అందరితో కలిసి ఆడుకోవాల్సిన ఆ చినారి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. నగరానికి చెందిన ఆంగోతు శ్రీనివాస్, కవితల కుమారుడు మాస్టర్ జితేందర్(6)కు ఇటీవల మెదడులో రక్తం గడ్డ కట్టింది. చికిత్స కోసం తల్లిదండ్రులు పంజగుట్ట నాగార్జునహిల్స్లోని లిటిల్స్టార్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు రోజుకు రూ.50 వేల వరకు ఖర్చు అవుతోంది. వైద్యఖర్చుల కోసం ఇప్పటికే ఉన్నదంతా అమ్ముకున్నారు.
ఇక వైద్యం చేయించే స్తోమత లేక, అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడి పరిస్థితిని చూడలేక తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దాతలు ఎవరైనా వైద్యం కోసం ఆర్థిక సహాయం చేసి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వారు వేడుకుంటున్నారు.