Nagarkurnool hospital
-
రోడ్డు ప్రమాదంలో పోలీసులకు గాయాలు
బిజినేపల్లి రూరల్ (నాగర్‌కర్నూల్) : ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు పంది అడ్డు రావడంతో ఢీకొని కిందపడి గాయపడ్డారు. ఈ సంఘటన పాలెం గ్రామ సమీపం లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోర్టు కేసులో ఎవిడెన్స్ కోసం పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెం దిన రాఘవేంద్ర, పవన్‌లు సోమవారం మ ధ్యాహ్నం ద్విచక్రవాహనంపై మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో పాలెం గ్రామ సమీపం లో పంది అడ్డు రావడంతో అదుపుతప్పి కిందపడ్డారు.ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ను నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. వి ష యం తెలుసుకున్న ఏఎస్పీ జోగుల చెన్న య్య, డీ ఎస్పీ లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న వారిని పరామర్శించారు. వైదు ్యలను అడి గి వివరాలు తెలుసుకున్నారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని.. కేటీదొడ్డి (గద్వాల) : ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని మల్లాపురం శివారులో చోటుచేసుకుంది. కుచినెర్ల గ్రామానికి చెందిన జంగం రఘు, రాముడు ద్విచక్రవాహనంపై డ్యాం నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన చిన్న దస్తగిరి ఆయన భార్యతో కలిసి కుచినెర్ల నుంచి గద్వాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో దస్తగిరి కాళ్లు విరగగా, జంగం రఘు, రాముడుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108లో కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ ఆస్పత్రికి తరలించారు. కారు, బైక్ ఢీకొని బిజినేపల్లి రూరల్ (నాగర్‌కర్నూల్): మండ లంలోని మంగనూర్లో ఎదురెదురుగా కారు, ఇన్నోవా ఢీకొని ఇరువురు డ్రైవర్లు గాయాలపాలై ఆస్పత్రికి చేరారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మంగనూర్ గ్రామానికి చెందిన ఉప్పరి నరేష్ కారులో బిజినేపల్లికి వస్తుండగా బిజినేపల్లి నుంచి మంగనూర్‌కు వెళ్తున్న ఇన్నోవా ఢీకొనడంతో ఇరువురు డ్రైవర్లకు గాయాలయ్యాయి. బాటసారులు గమనించి ఇద్దరిని చికిత్స కోసం నాగర్‌కర్నూల్‌కు తరలించారు. -
అమ్మ పాలతో ఆరోగ్యం!
పాలమూరు: బిడ్డ పుట్టగానే తల్లికి మొదటగా వచ్చే పాలను ‘ముర్రు పాలు’ అంటారు. వీటిలో ఔషధ గుణాలు, రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటంతో పాటు తలీబిడ్డలకు కూడా మేలు జరుగుతుంది. అందుకే తల్లి పాలను అమృతంతో పోలుస్తారు. తల్లిపాలు బిడ్డకు ఆకలిని తీర్చడంతో పాటు వారి మానసిక, శారీరక ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్లు అందిస్తాయి. కొందరు తల్లులు అనేక అపోహాలతో బిడ్డలకు పోతపాలు అందిస్తున్నారు. అయితే, ఇది సరికాదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు తల్లుల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. మారుతున్న జీవన విధానం నానాటికీ సమాజంలో వస్తున్న మార్పుల్లో భా గంగా ఈ తరం తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడాని కి సందేహిస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలే ఇలాంటి పనులు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ మేరకు తల్లులకు కూడా తల్లిపాల ప్రా ముఖ్యతపై కౌన్సెలింగ్ చేయాల్సి ఉంది. ఏటా తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నా కొన్నిచోట్ల త మ పిల్లలకు పాలిచ్చేందుకు అనువైన పరిస్థితులు కరవయ్యాయని సామాజికవేత్తలు ౠవేదన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో 1993లో తల్లిపాల వా రోత్సవాల సందర్భంగా ప్రతీ సంస్థలో మాతృ దో హద పరిస్థితులు తీసుకురావాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 2015 వారోత్సవాల్లో కూడా ఇదే ప్రధాన నినాదంగా ఉంది. ఈ విధానాలు, చట్టాల ప్రకారం.. ఉద్యోగం, పని చేసే మహిళలు తమ బి డ్డలకు పాలిచ్చేందుకు అనువైన పరిస్థితులను, స దుపాయాలను సంబంధిత సంస్థలు ఏర్పాటు చే యాల్సి ఉంది. అయినా సమస్యలు తీరడం లేదు. బిడ్డకు ప్రయోజనం కోసం బిడ్డ పుట్టిన అరగంట లోపు ముర్రుపాలు తాగిస్తే వారిలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతారని వైద్యులు చెబుతున్నారు. అంటు వ్యాధుల నుంచి రక్షిస్తూ మలబద్దకం తగ్గుతుంది. బాల్యంలో యవ్వనంలో ఉబకాయం వ్యాధుల నుంచి సంరక్షణ ఉంటుంది. పుట్టిన బిడ్డకు చనుపాలు ఇవ్వటంతో రక్తస్రావ ప్రమాదం తగ్గి తల్లి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది. బలంగా ఉంటూ గర్భానికి పూర్వం ఉన్న బరువుకే తల్లి చేరుకుంటుంది. పాలే సరైన పౌష్టికాహారం బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు అందించాలి. అవి బిడ్డలో రోగనిరోధక శక్తికి, మానసిక వికాసానికి దోహదపడతాయి. ఆరు నెలల వరకు తల్లిపాలే అందించాలి. తల్లిపాలు తాగిన పిల్లలకు తెలివితేటలు బాగుంటాయి. బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తల్లికి రొమ్ము కేన్సర్, రక్తస్రావం నుంచి విముక్తి కలుగుతుంది. – డాక్టర్ రాధ, గైనిక్ విభాగం హెచ్ఓడీ, జనరల్ ఆస్పత్రి, మహబూబ్‌నగర్ తల్లిపాల ఆవశ్యకతపై ప్రచారం తల్లిపాల ప్రాముఖ్యతపై ఈ వారం రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి బాలింతలు, మహిళలకు అవగాహన కల్పిస్తాం. ప్రతీ గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటుచేయడమే కాకుండా పీహెచ్‌సీల్లో ప్రసవమైన తల్లులు, ఏరియా, సివిల్ ఆస్పత్రుల్లో ప్రసవించిన తల్లులే కాకుండా వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులకు సైతం తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తాం. – డాక్టర్ రజిని, డీఎంహెచ్ఓ, మహబూబ్‌నగర్ -
60 మంది గర్భిణులు.. 12 గంటల ప్రసవ వేదన
- నాగర్‌కర్నూల్ ఆస్పత్రిలో దారుణం పురిటి నొప్పులతోనే ఆందోళన - గైనకాలజిస్ట్లు లేక గర్భిణులను తిప్పి పంపిన ఆస్పత్రి సిబ్బంది సాక్షి, నాగర్‌కర్నూల్: 60 మంది గర్భిణులు.. 12 గంటల ప్రసవ వేదన.. నాగర్‌కర్నూల్ జిల్లాలో నరకయాతన అనుభవించిన దారుణమిది. ప్రసవ వేదనతో ఆస్పత్రికి వచ్చి పండంటి బిడ్డతో తిరిగి ఇళ్లకు వెళ్లాలనుకున్న వారి ఆశలపై అధికారులు నీళ్లుచల్లారు. డాక్టర్లు లేరు పొండి.. అంటూ వారిని ఆస్పత్రి నుంచి సిబ్బంది పంపివేయడంతో తీవ్ర మనోవేదనకు గురై.. పురిటి నొప్పులతోనే రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. ఆస్పత్రుల్లో మహిళలకు ప్రసవాలు జరిపించడంలో విఫలమయ్యారని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలంటూ గర్భిణులు, వారి బంధువులు రాస్తారోకో చేస్తూ నినాదాలు చేశారు. గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. వారికి రూ.12 వేల నజరానాతోపాటు కేసీఆర్ కిట్‌ను అందిస్తోంది. దీంతో ఆస్పత్రిలో ప్రసవాలు చేసుకునేందుకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయితే ఇందుకు తగ్గట్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు లేకపోవడంతో నిండు చూలాలు నొప్పులు భరించలేక కష్టాలు పడుతున్నారు. మంగళవారం ఉదయమే నాగర్‌కర్నూల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మంది గర్భిణులు ప్రసవం కోసం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. తమకు కాన్పులు చేయాలంటూ అక్కడి సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. గైనకాలజిస్ట్లు విధులకు హాజరుకావడం లేదని వారు సెలవులో ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో గర్భిణి మహిళలు, వారి బంధువులు నిరాశ చెందారు. ప్రభుత్వం ఓ పక్క ఆస్పత్రిలో ప్రసవాలు చేసుకోండంటూ ప్రచారం చేస్తుండగా.. మీరేమో ఇలా చెబుతున్నారంటూ సిబ్బందిపై మండిపడ్డారు. తమకేమీ తెలియదని అక్కడి సిబ్బంది చేతులెత్తేయడంతో ప్రసవం కోసం వచ్చిన గర్భిణులతో బంధువులు ఆస్పత్రి ముందు మహబూబ్‌నగర్ – శ్రీశైలం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇంత జరుగుతున్నా పరిస్థితిని సమీక్షించేందుకు డీఎంఅండ్‌హెచ్‌ఓ గానీ, జిల్లా ఉన్నతాధికారులుగానీ అక్కడికి రాకపోవడంతో చివరికి పోలీసులు కలుగజేసుకుని వారికి నచ్చజెప్పి పంపారు. చాలామంది మహిళలు నెలలునిండి నడవలేని స్థితిలో ఆస్పత్రికి రాగా.. వారికి కనీస వైద్యం అందించేందుకు నిపుణులైన వైద్యులు లేకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.