Nagole to Miyapur
-
హైదరాబాద్ మెట్రోకు అయిదేళ్లు.. తీరని నష్టాలు.. తప్పని సవాళ్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో నేటితో అయిదేళ్లు పూర్తిచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2017 నవంబరు 28న మియాపూర్ – నాగోల్ (30 కి.మీ) మార్గంలో జెండా ఊపి మెట్రోను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు నగర మెట్రో ఎన్నో మైలురాళ్లు అధిగమించినప్పటికీ ఎన్నో సవాళ్లు.. నష్టాలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత అయిదేళ్లుగా మెట్రో అధిగమించిన మైలురాళ్లను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే.. ►ప్రస్తుతం నాగోల్– రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో నగరంలో 69.2 కిలోమీటర్ల మార్గంలో మెట్రో అందుబాటులో ఉంది. నిత్యం 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. మొత్తం మూడు రూట్లలో 57 స్టేషన్లున్నాయి. ►ఈ ఏడాది అక్టోబర్ 3న డిజిటల్ ఇండియాకు అనుగుణంగా దేశంలోనే మొదటిసారిగా మెట్రో రైల్ సేవల్లో సమగ్రమైన డిజిటల్ చెల్లింపు ఆధారిత మెట్రో టికెట్ బుకింగ్ సేవలను వాట్సాప్ ఈ –టికెటింగ్ సదుపాయంతో ప్రారంభించింది. ►ఇదే సంవత్సరం జూన్ 15న ప్యాసిజర్ ఎంగేజ్మెంట్, సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్ వినూత్నమైన మెట్రో బజార్ కాన్సెప్ట్ , షాపింగ్ ఆన్ ద గో నేపథ్యంతో వచ్చింది. మెట్రో ప్రయాణికులకు అనుభవపూర్వక షాపింగ్ అవకాశాలను ఇది అందించింది. ►ఇదే ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్ మెట్రో రైల్‌కు సీఎంఆర్ఎస్ అనుమతి లభించింది, దీని ద్వారా మెట్రో రైళ్లను పూర్తి వేగంతో నడపవచ్చు. రైళ్ల వేగం గంటకు 70 కిలోమీటర్ల నుంచి 80 కేఎంపీహెచ్ పెరిగింది. దీంతో పలు కారిడార్లలో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. ► మార్చి 31న సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు విడుదల చేసింది. దీంతో అపరిమితంగా నగరంలోని 57 మెట్రో స్టేషన్లు, మూడు కారిడార్లలో తిరిగే అవకాశం లభిస్తుంది. ఇది సంవత్సరంలో 100 సెలవు దినాలలో అందుబాటులో ఉంటుంది. ► 2021 ఫిబ్రవరి 2న హైదరాబాద్ మెట్రో రైల్ ఓ రోగిని బతికించడం కోసం గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసింది. అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగి కోసం హెచ్ఎంఆర్ 21 కిలోమీటర్ల ప్రత్యేక గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా నాగోల్, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్ల మధ్య నాన్‌స్టాప్‌గా ప్రయాణించి రోగి ప్రాణాలను కాపాడింది. ► ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకుని కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గిస్తుంది. మెట్రో రైల్ 8.35 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ ప్లాంట్లను బహిరంగ ప్రదేశాలలో, మెట్రో రైల్ డిపోల వద్ద, రూప్టాఫ్ల మీద 28 మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసింది. ఈ సోలార్ సామర్థ్యంతో హైదరాబాద్ మెట్రో రైల్ తమ విద్యుత్ అవసరాలలో 15 శాతం తీర్చుకుంటోంది. ► మెట్రో రైళ్ల వినూత్నమైన రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్ధల ద్వారా సుమారు 40 శాతం విద్యుత్‌ను పునర్వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. నిత్యం మెట్రో రైళ్లలో స్మార్ట్ కార్డ్‌లతో జర్నీ చేసే వారికి లాయల్టీ బోనస్ అందించేందుకు మెట్రో వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. కేవలం ఎంపిక చేసిన సిరీస్ నంబర్లున్న వినియోగదారులకే ఈ బోనస్ అందుతుందని మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ ఆఫర్‌పై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నాయి. -
నేటినుంచి రాత్రి 11.15 గంటల వరకు మెట్రో సేవలు
సాక్షి, హైదరాబాద్: మెట్రో సేవలు సోమవారం నుంచి ఉదయం 7 నుంచి రాత్రి 11.15 గంటల వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో నిర్మాణ, నిర్వహణ సంస్థ ఎల్అండ్టీ తెలిపింది. ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 10.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు చివరి గమ్యస్థానం చేరుకుంటుందని ప్రకటించింది. కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం మెట్రో స్టేషన్లు, రైళ్లను శానిటైజేషన్ చేస్తున్నట్లు పేర్కొంది. -
అకస్మాత్తుగా నిలిచిపోయిన మెట్రో సేవలు
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న హైదరాబాద్ మెట్రో రైలుకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఉత్సాహంగా రైలు యాత్ర చేద్దామని వచ్చిన నగరవాసులకు తీవ్ర నిరాశ ఎదురైంది. నాగోల్-అమీర్‌పేట్ మార్గంలో.. ఆదివారం ఉదయం సుమారు రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సర్వీసుల నిలిపివేతకు సంబంధించి కనీస సమాచారం కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైలు నిలిపివేత : నాగోల్ నుంచి అమీర్‌పేట్‌కు బయలుదేరిన ఒక సర్వీసులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ రైలును ప్రకాశ్‌నగర్ పాకెట్ పార్కింగ్ వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రెండు టెర్మినళ్ల వద్దా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటికే టికెట్లు కొనుక్కుని ఫ్లాట్‌ఫామ్స్‌పైకి వచ్చిన ప్రయాణికులు.. ఎంతకీ రైళ్లు కదలకపోవడంతో కంగారుపడ్డారు. టికెట్ డబ్బులు తిరిగి ఇస్తారో, లేదో తెలియని అయోమయస్థితిలో వేరే మార్గాల ద్వారా గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. మైట్రో రైలు నిలిపివేతకు సంబంధించి అధికారుల స్పందన వెలువడాల్సిఉంది. -
మెట్రో ప్రారంభం కన్ఫర్మ్.. మోదీకి ఇన్విటేషన్!
-
మెట్రో ప్రారంభం కన్ఫర్మ్.. మోదీకి ఇన్విటేషన్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెట్రోరైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. నాగోలు నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల పరిధిలో నవంబర్ నెల నుంచి మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఈ మేరకు నవంబర్ 28న మెట్రో రైలు ప్రారంభానికి విచ్చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం లేఖ రాశారు. ఈ లేఖను ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ గురువారం ట్వీట్ చేశారు. మెట్రోరైలును ప్రారంభించాల్సిందిగా 25-5-2017న వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయాన్ని ఈ లేఖలో గుర్తుచేసిన సీఎం కేసీఆర్.. నవంబర్‌లో ఇందుకోసం రావాలని ఈ లేఖలో కోరారు. రూ. 15,000 కోట్ల వ్యయంతో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో అతిపెద్ద ప్రాజెక్టుగా.. హైదరాబాద్ మెట్రోరైలును ప్రతిష్టాత్మకంగా చేపట్టామని లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సదస్సును ప్రారంభించడానికి ఇప్పటికే ప్రధాని ఒప్పుకున్న నేపథ్యంలో ఇదే పర్యటనలో భాగంగా మెట్రోరైలును కూడా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ మోదీని కోరారు. Hon'ble CM's letter to Hon'ble PM Sri @narendramodi Ji to inaugurate 30KM stretch of Hyderabad Metro from Nagole to Miyapur on 28th Nov,2017 pic.twitter.com/jM4uRcRA94 — KTR (@KTRTRS) 7 September 2017