Nalco shares
-
షేర్ల బైబ్యాక్‌కు నాల్కో బోర్డ్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నేషనల్ అల్యూమినియమ్ కంపెనీ(నాల్కో) రూ.504.8 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు శుక్రవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని నాల్కో పేర్కొంది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్ ధరను రూ.75 చొప్పున 6,73,11,386 షేర్లకు మించకుండా బైబ్యాక్ చేస్తామని వివరించింది. కాగా ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఐదు రెట్లు పెరిగి రూ.687 కోట్లకు పెరి గింది. బైబ్యాక్‌కు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో నాల్కో షేర్ స్వల్పంగా లాభపడి రూ.66.95 వద్ద ముగిసింది. -
నాల్కో షేర్ల బై బ్యాక్‌కు డెరైక్టర్ల బోర్డు ఆమోదం
న్యూఢిల్లీ: అల్యూమినియం తయారు చేసే ప్రభుత్వ రంగ కంపెనీ నాల్కో షేర్ల బైబ్యాక్‌కు ఆ కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. 64.43 కోట్ల షేర్లకు (చెల్లించిన మూలధనంలో 25 శాతం వాటా) మించకుండా బై బ్యాక్ కోసం నాల్కో కంపెనీ రూ.2,835 కోట్లు వ్యయం చేయనుంది. ఒక్కో షేర్‌ను రూ.44కు కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. ఇక ఈబై బ్యాక్‌కు వాటాదారుల ఆమోదాన్ని ప్రత్యేక తీర్మానం ద్వారా పొందుతామని, దీనిని పోస్టల్ బ్యాలెట్ ద్వారా సమీకరిస్తామని వివరించింది. ఈ కంపెనీలో 80.93 శాతం వాటా ఉన్న ప్రభుత్వం గతంలో 25 శాతం వాటా విక్రయం ద్వారా రూ.3,250 కోట్లు సమీకరించాలని యోచించింది. బై బ్యాక్ ప్రకటన నేపథ్యంలో నాల్కో షేర్ స్వల్పంగా 1.65 శాతం లాభపడి రూ. 43 వద్ద ముగిసింది.