రూ.5కోట్ల 72 లక్షల బంగారం పట్టివేత
నల్గొండ : నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండ గూడెంలో ఏపీపీఓ బోర్డర్ వద్ద చెక్‌పోస్టు తనిఖీలు నిర్వహించారు. ఆధారాలు లేకుండా అక్రమంగా తీసుకెళ్తున్న... 5 కోట్ల 72 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.