nallagutta
-
నల్లగుట్టలో టెన్షన్
సాక్షి, చాంద్రాయణగుట్ట : ఇరాన్ నుంచి ఎనిమిది మంది మతప్రచారకులు హైదరాబాద్‌లోని నల్లగుట్టకు వచ్చారనే సమాచారంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 18 నుంచి నలుగురు పురుషులు నల్లగుట్ట మసీదులోనే బస చేస్తుండగా నలుగురు మహిళలు మసీదు కమిటీకి చెందిన ఓ సభ్యుడి ఇంట్లో బస చేస్తున్నారు. అయితే ప్రాథమిక పరీక్షల్లో వారికి కరోనా లక్షణాల్లేవని తేలడంతో వారిని ఈ నెల 29 వరకు క్వారంటైన్ చేశారు. అయినా స్థానికుల్లో అనుమానం వెంటాడుతోంది. ఇరాన్ నుంచి 8 మంది గత నెల 24న ఢిల్లీకి విమానంలో వచ్చారు. అక్కడి నుంచి 29న హైదరాబాద్‌కు రైలులో వచ్చారు. మల్లేపల్లిలోని బడా మసీదులో అప్పటి నుంచి బస చేస్తూ ఉన్నారు. గురువారం రాత్రి ఈ విషయం తెలియడంతో రాంగోపాల్‌పేట పోలీసులు మసీదు కమిటీ ప్రతినిధులను సంప్రదించారు. వారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించేందుకు యత్నించగా, కరోనా లక్షణాలు లేవని అంగీకరించలేదు. శుక్రవారం ఉదయం వైద్య బృందం వచ్చి వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించడంతో ఎలాంటి లక్షణాలు కన్పించలేదు. ఈ నెల 29న వారు తిరిగి ఢిల్లీ వెళ్లి.. వచ్చే నెల 4న ఇరాన్ వెళ్తుండటంతో అప్పటివరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. మరోవైపు కిర్గిస్తాన్ నుంచి ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చిన 11 మందితోపాటు యూపీకి చెందిన మరో ఇద్దరు గైడ్లు రెండు రోజుల నుంచి రియాసత్‌నగర్‌లోని ఓ ప్రార్థనామందిరంలోనే ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకుని అధికారులు వారిని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. -
వేధింపులకు మహిళా సాప్ట్వేర్ ఇంజినీర్ బలి
-
వేధింపులకు మహిళా సాప్ట్వేర్ ఇంజినీర్ బలి
హైదరాబాద్ : అత్తింటి వేధింపులకు ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలైంది. సికింద్రాబాద్ నల్లగుట్టలో సాప్ట్వేర్ ఇంజినీర్ శ్వేత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. కాగా శ్వేత ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతుండగా, భర్త శ్రీకాంత్, అత్తమామలే తమ బిడ్డను హతమార్చారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి అయిన కొద్దిరోజుల నుంచే శ్వేతను భర్త వేధింపులకు గురి చేస్తున్నట్లు వారు తెలిపారు. శ్వేతను ఉద్యోగం మానేని రాజకీయాల్లోకి రావాలని శ్రీకాంత్ వేధించేవాడని, ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి శ్వేత అంగీకరించకపోవటంతో తరచు భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగేదని స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి మద్యం సేవించి వచ్చిన శ్రీకాంత్... ఇదే విషయంపై భార్యతో గొడవ పడనట్లు తెలుస్తోంది. తెల్లారి లేచి చూసేసరికి శ్వేత ఉరి వేసుకున్నట్లు చెబుతున్నారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా టికెట్ కోసం శ్రీకాంత్ ప్రయత్నించినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు... పోస్ట్‌మార్టం నిమిత్తం శ్వేత మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.