నా డాన్సు చూసి నవ్వుకున్నా పర్వాలేదు
క్యారెక్టర్ ఆర్టిస్టు, ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగల నటుడు నానా పాటేకర్.. తన డాన్సు గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. డాన్సులలో తాను తప్పులు చేస్తానని, తన డాన్సు చూసి జనం నవ్వుకున్నా తనకు ఏమీ ఇబ్బంది లేదని అన్నాడు. తన తప్పుడు డాన్సు చూడాలంటే ప్రజలు ఇష్టపడతారని చెప్పాడు. తప్పులు చేయడానికి కూడా తాను రిహార్సల్స్ చేసుకుంటానని, దానివల్ల ధైర్యంగా తప్పు చేయొచ్చని నానా చెప్పాడు.
వెల్కమ్ బ్యాక్ సినిమా గురించి మాట్లాడే సందర్భంగా నానా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో నానాతో పాటు ఇంకా జాన్ అబ్రహం, అనిల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిరోజ్ ఎ నడియాడ్వాలా నిర్మించారు. ఈ సినిమాకు 100 కోట్ల కలెక్షన్లు రావడం ఖాయమని నానా పాటేకర్ ధీమా వ్యక్తం చేశాడు.