లతీష్‌రెడ్డిని పరామర్శించిన జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం గుంటూరు జిల్లా పార్టీ నేత నన్నపనేని సుధ భర్త లతీష్‌రెడ్డిని పరామర్శించారు. ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడిన లతీష్‌రెడ్డి ఇక్కడి స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జగన్‌తోపాటు మరో నేత అయోధ్య రామిరెడ్డి కూడా ఆసుపత్రికి వెళ్లి లతీష్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారిద్దరూ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.