తెలుగు విద్యార్థినికి యూరోపియన్ అవార్డు
కోల్‌కతా: యూరోపియన్ మెటీరియల్ రీసెర్చ్ సొసైటీ-2016 యువ శాస్త్రవేత్త అవార్డును భారత ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో పీహెచ్డీ చేస్తున ్న తెలుగు విద్యార్థిని నందిని భండారు కైవసం చేసుకుంది. మెటీరియల్ సైన్స్, నానో టెక్నాలజీలో చేసిన కృషికిగానూ ఈ అవార్డు లభించినట్లు వర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ముఖ్యంగా నానో టెక్నాలజీలో నందిని విశేష కృషి చేస్తోందని, సూక్ష్మ ఆకారంలో ఉండే వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడే నానో ఫాబ్రికేషన్, నానో పాటర్నింగ్ మొదలగు అంశాలను అధ్యయనం చేస్తుందని వివరించింది. నందిని చేసిన ఈ ఆవిష్కరణల వల్ల ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉపయోగించే ‘మదర్ బోర్డు’ల పరిమాణం తగ్గడంతో పాటు తక్కువ ఖర్చుకే లభించే అవకాశం ఉందని తెలిపింది. ఈ టెక్నిక్‌పై ఇప్పటికే పేటెంట్‌ను పొందామని, త్వరలోనే ఈ దిశగా బిజినెస్ ప్రారంభిస్తామన్నారు.