చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలం తర్వాత చిరంజీవి నివాసానాకి పవన్ కల్యాణ్ వెళ్లడం విశేషం. ఈ సందర్భంగా చిరుకు పవన్ బర్త్ డే విషెష్ చెప్పారు. సుమారు 45 నిమిషాలు చిరంజీవితో గడిపారు. అలాగే ఇవాళ సాయంత్రం పార్క్ హయాత్ హోటల్లో కుటుంబ సభ్యులతో జరిగే చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. కాగా చిరంజీవి ఇంటికి పవన్ రావడంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా నిన్న శిల్పకళా వేదికలో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా పవన్ అభిమానులపై ఆయన రెండో సోదరుడు నాగబాబు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీలోని ఫంక్షన్లకు పవన్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.