జాతీయ రహదారిగా ఖేడ్- బీదర్ రోడ్డు
* రూ.10కోట్లు మంజూరు ఎంపీ బీబీపాటిల్
నారాయణఖేడ్: నియోజకవర్గంలోని రహదారుల అభివృధికి కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. నారాయణఖేడ్- బీదర్ రహదారి జాతీయ రహదారిగా మారనున్నదని, ఖేడ్ నుంచి సంత్పూర్ రహదారి నిర్మాణానికి రూ.10కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. శనివారంఖేడ్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఎంపీ బీబీ పాటిల్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఖేడ్ ప్రాంతాభివృద్ధికి పాటుపడతానన్నారు.
నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా స్థానిక నేతలు ఎంపీని ఘనంగా సత్కరించారు. అంతకు ముందు కార్యకర్తలు పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు బిడెకన్నె హన్మంతు, వెంకట్రాంరెడ్డి, రవీందర్‌నాయక్, ప్రభాకర్, మారుతిపటేల్, ఇస్మాయిల్, నవాబ్, గోవింద్‌యాదవ్, మల్‌శెట్టియాదవ్, మారుతి యాదవ్, మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు.