narsampet town
-
వివాహేతర సంబంధం: సుపారీ ఇచ్చి ప్రియుడి కిడ్నాప్, పెళ్లి.. సినీ ఫక్కీలో ఘటన
సాక్షి, వరంగల్: మూడ్రోజుల క్రితం నర్సంపేట పట్టణంలోని కమలాపురంకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి శ్రీనివాస్ కిడ్నాప్ అయిన విషయం పాఠకులకు విదితమే. ఈ కేసును నర్సంపేట పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. విచారణను మమ్మురం చేశారు. సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్‌ను శుక్రవారం పోలీసులు ఓ కొలిక్కి తీసుకువచ్చారు. నర్సంపేట మున్సిపాలిటి పరిధి 2వ వార్డు కమలాపురం గ్రామానికి చెందిన ముత్యం శ్రీనివాస్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. దీంతో పాటు మద్యం షాపు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు పైనాన్స్ (రోజువారీ చిట్టి) ఇచ్చాడు. రోజూ ఆమె ఇంటికి వెళ్తూ చిట్టీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. చదవండి: వాట్సప్ చివరి స్టేటస్.. ఊరి నుంచి తెచ్చుకున్న అమ్మ చీరతోనే ఉరేసుకుని.. ఈ క్రమంలో వారిద్దరూ వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నారు. కొద్ది రోజులకు ఈ విషయం బయటకు పొక్కడంతో గతేడాది పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించారు. ఇచ్చిన అప్పు పోను కొంత నగదు ఆమెకు చెల్లించాలని తీర్మానం చేశారు. నాలుగు నెలల క్రితం ఈ విషయం బయటకు రావడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళా శ్రీనివాస్‌ను పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే సుపారీ గ్యాంగ్‌ను కలిసి కొంత నగదును అడ్వాన్స్‌గా అప్పగించింది. చదవండి: పెగాసస్‌పై న్యూయార్క్ సంచలన నివేదిక.. మరోసారి దుమారం దీంతో సుపారీ గ్యాంగ్ ఈనెల 26న శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసింది. శ్రీనివాస్‌ను కొట్టి ఆమెతో దండలు మార్పించినట్లు సమాచారం. శ్రీనివాస్ కుమారుడు భరత్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొబైల్ ట్రాక్ చేసి నర్సంపేట సీఐ పులి రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన సుపారి గ్యాంగ్ పరారయ్యింది. పోలీసులు శ్రీనివాస్ ను, మహిళను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. దీనిపై స్థానిక సీఐ పులి రమేశ్‌ను వివరణ కోరగా.. ముత్యం శ్రీనివాస్ కొడుకు భరత్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు దొరికిన వెంటనే అరెస్టు చూపిస్తామని తెలిపారు. చదవండి: సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు -
నర్సంపేట బంద్ విజయవంతం
నర్సంపేట : నర్సంపేటను ప్రత్యేక జిల్లా కోరుతూ చేపట్టిన బంద్ విజయవంతమైంది. పట్టణంలోని వాణిజ్య, వ్యాపా ర, పెట్రోల్‌బంక్, విద్యాసంస్థలు, బ్యాం కులు స్వచ్ఛందగా బంద్ చేపట్టారు. ఉదయం అన్ని పార్టీల నాయకులు రోడ్లపైకి వచ్చి శాంతియుత వాతావరణంలో బంద్ చేయించారు. అనంతరం బస్టాం డ్ మొదటి గేటు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశం లో జేఏసీ డివిజన్ కార్యదర్శి అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు జిల్లాలను చేయాల్సి ఉండగా ప్రభుత్వం కొందరి స్వార్ధ ప్రయోజనాల కోసం జిల్లాలను ఏర్పాటుచేస్తున్నారే తప్పా ప్రజల అవసరాల కోసం చేయ డం లేదని విమర్శించారు. అన్ని వసతులు ఉన్న నర్సంపేటను జిల్లాగా ఏర్పాటు చేసి పాకాల జిల్లాగా నామకరణం చేయాలన్నారు. విధి విధానాలు లేకుండా చేయడం సరికాదు : పి.శ్రీనివాస్, కౌన్సిలర్ విధి విధానాలు ప్రకటించకుండా ఇష్టార్యాజంగా జిల్లాలను చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని, తక్షణమే విధి విధానాలు ఏర్పాటుచేసి ఆయా పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల అభీష్టం మేరకు జిల్లాలను చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వసతులు ఉన్న నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు డాక్టర్ జగదీశ్వర్, ఎర్ర యాకుబ్‌రెడ్డి, బానోత్ లక్ష్మణ్‌నాయక్, పెండెం రామానంద్, షేక్ జావీద్, కళ్లెపల్లి ప్రణయ్‌దీప్, న్యాయవాదులు పాల్గొన్నారు.