ఎడారి దేశంలో కళా నైపుణ్యం
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామానికి చెందిన నర్సింహా చారి పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం దుబాయికి వెళ్లాడు. అక్కడ ఓ బేకరీలో పనిలో చేరాడు. బెకరీలో కేక్‌లను కళా ఖండాలుగా తయారు చేసి పేరు తెచ్చుకున్నాడు. దుబాయిలో ఇటీవల కేక్‌ల తయారీపై పోటీలు నిర్వహించారు. ఇందులో అనేక బేకరీ కంపెనీలు పాల్గొని రకరకాల కేక్‌లను తయారు చేశాయి. ఇందులో నర్సింహాచారి తయారు చేసిన కేక్‌కు బహుమతి వచ్చింది. దుబాయి ప్రభుత్వం నర్సింహాచారికి బంగారు పతకంతో పాటు ప్రసంశాపత్రం అందించింది. బంగారు పతకం సాధించి ఆయన పనిచేసే మిస్టర్ బెకరీ కంపెనీకి మంచి పేరు తెచ్చిపెట్టడంతో నర్సింహాచారికి కంపెనీ ప్రత్యేక స్థానం ఇచ్చింది. మంచి వసతులతో పాటు జీతభత్యాలను పెంచింది. తన కళాఖండాలకు మంచి గుర్తింపు వచ్చిందని నర్సింహాచారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. – అల్లాడి శేఖర్, ధర్పల్లి