వాడ్ని పట్టుకుంటా: మెకల్లమ్
వెల్లింగ్టన్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎక్కువయ్యాయి. పుకార్ల విషయంలో అయితే చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్ నాథన్ మెకల్లమ్‌ను సోషల్ మీడియా వేదికగా చంపేశారు. దీంతో ఆయన అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు అతని మరణానికి సంతాపం తెలియజేస్తూ ట్వీటర్లో సందేశాలను పోస్టు చేశారు.
అయితే, తాను చనిపోయానంటూ వచ్చిన వార్తలపై నాథన్ మెకల్లమ్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. దీంతో స్వయంగా అతడే ట్విటర్ వేదికగా తాను బతికే ఉన్నానంటూ అభిమానులకు తెలియజేశాడు. "నేను చావలేదని.. డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో సంతోషంగా ఉన్నాను" అని ఓ ట్వీట్ చేశాడు.
అయితే అతని సోదరుడు, మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం ఈ పుకార్లపై చాలా సీరియస్ అయ్యాడు. ‘మా సోదరుడు చనిపోయాడంటారా.. ఈ వార్త వ్యాప్తి చేసిన వాడిని పట్టుకుంటా అంటూ ట్వీట్ చేశాడు. ఈ వార్త తెలిసినప్పుడు తాను విమానంలో ఉన్నా. ఇలాంటి చెత్త వార్తలను సృష్టించిన వారెవరైనా, ఎక్కడున్నా, ఎలాగైనా పట్టుకుంటా’ అని మెకల్లమ్ ట్వీట్ చేశాడు.
Tonight someone decided, via social media to release that my brother passed away! Im on a flight back to NZ and my heart broke! None of it is true! Whoever put this out there, I’ll find you! Somewhere, somehow.
— Brendon McCullum (@Bazmccullum) 1 December 2018
నేను బతికే ఉన్నాను: మెకల్లమ్