జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం?
ఫారెస్ట్ ఆఫీసర్స్
జీకే - కరెంట్ అఫైర్స్
1. 2014 ఏప్రిల్‌లో దక్షిణ కొరియాలోని గిమ్ చెయాన్లో నిర్వహించిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారతీయ క్రీడాకారిణి?
పి.వి. సింధు
2. జస్టిస్ ఆర్.ఎమ్. లోధా 2014 ఏప్రిల్ 27న
సుప్రీంకోర్టుకు ఎన్నో ప్రధాన న్యాయ మూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు?
41వ
3. {పతిష్టాత్మక గోల్డ్‌మ్యాన్ పర్యావరణ బహుమతిని 2014 ఏప్రిల్‌లో గెలుపొందిన ఛత్తీస్గఢ్పర్యావరణ కార్యకర్త?
రమేష్ అగర్వాల్
4. నోబెల్ అని దేన్ని అంటారు?
గోల్డ్‌మ్యాన్ పర్యావరణ బహుమతిని
5. 61వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైన సినిమా?
నా బంగారు తల్లి
6. ఏ దేశం నుంచి రష్యా సేనలు వైదొలగి 2014 ఫిబ్రవరి 15 నాటికి 25 ఏళ్లు పూర్త య్యాయి?
అఫ్ఘానిస్తాన్
7. అంగారక గ్రహం అధ్యయనం కోసం ప్రయోగించిన మంగళ్యాన్ ఏ తేదీన 100 రోజులు పూర్తి చేసుకుంది?
2014 ఫిబ్రవరి 12 (2013 నవంబరు 5న ప్రయోగించారు)
8. 2014 ఫిబ్రవరిలో తమామ్ సలామ్ ఏ దేశానికి నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు?
లెబనాన్
9. 2014 ఫిబ్రవరి 14న ఎన్రికో లెట్టా ఏ దేశ ప్ర ధానమంత్రి పదవికి రాజీనామా చేశారు?
ఇటలీ
10. 2014 ఫిబ్రవరిలో ఔత్సాహిక చిన్న వ్యాపారవేత్తల కోసం * 500 కోట్లతో ప్రారంభించిన ఫండ్?
ఇండియా ఇన్‌క్లూజివ్ ఇన్నోవేషన్ ఫండ్ (ఐఐఐఎఫ్)
11. 2014 ఫిబ్రవరి 9న జరిగిన రిఫరెండంలో యూరోపియన్ యూనియన్ నుంచి పౌరుల వలసలను నిరోధించే ప్రతిపాదనకు ఏ దేశ ఓటర్లు ఆమోదం తెలిపారు?
స్విట్జర్లాండ్
12. 2014 సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు ఆసియా క్రీడలను ఏ నగరంలో నిర్వహించనున్నారు?
ఇంచియాన్ (దక్షిణ కొరియా)
13. 2014 ఫిబ్రవరిలో నేపాల్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
సుశీల్ కొయిరాలా
14. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ?
జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ
15. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ైచైర్మన్‌గా 2014 ఫిబ్రవరిలో ఎవరు ఎన్నికయ్యారు?
నజమ్ సేథి
16. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ రెండోదాన్ని 2014 ఫిబ్రవరిలో ఎక్కడ ప్రారంభించారు?
ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో
17. 2014 ఫిబ్రవరి 17నుంచి 19వ తేదీ వరకు బయోటెక్నాలజీ సదస్సు (బయోఏషియా) ను ఎక్కడ నిర్వహించారు?
హైదరాబాద్
18. 2014 సంవత్సరానికి జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స అవార్డు లభించిన జర్మనీ ప్రొఫెసర్ ఎవరు?
వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ హెరాల్డ్ జుర్ హుస్సేన్
19. పోలియోపై విజయానికి నాయకత్వం వహించినందుకు రోటరీ అత్యున్నత పురస్కారాన్ని 2014 ఫిబ్రవరి 11న ఎవరికి ప్రదానం చేశారు?
భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ
20. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఉపలోకాయుక్తగా 2014 ఫిబ్రవరిలో ఎవరిని నియమించారు?
టి.గంగిరెడ్డి
21. 2014 జనవరిలో రాజస్థాన్‌కు చెందిన కుమారి మలేకా సింగ్ తక్ అనే 16 ఏళ్ల బాలికకు లభించిన అవార్డు?
ధైర్యసాహసాలకిచ్చే గీతాచోప్రా అవార్డు
22. 2014 ఫిబ్రవరి 12న రైల్వే బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు?
రైల్వేమంత్రి మల్లికార్జున ఖర్గే
23. 2014-15 సంవత్సరానికి ఎన్ని కొత్త రైళ్లను ప్రకటించారు?
73
24. 2014-15లో 17 ప్రీమియం ఏసీ ైరైళ్లను ప్రవేశపెట్టనున్నారు. వీటి పేరు?
జైహింద్ రైళ్లు
25. ఏ ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా రైలు మార్గాలను ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నారు?
అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ
26. భారతీయ మార్కెట్ నుంచి ఇటీవల ఉపసంహరించిన ‘ద హిందూస్ - అన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ’ రచయిత్రి?
అమెరికాకు చెందిన వెండీ డొనిజెర్
27. 2014 ఫిబ్రవరిలో ఇరానీ కప్ క్రికెట్‌ను గెలుచుకున్న జట్టు?
కర్ణాటక (రెస్టాఫ్ ఇండియాను ఓడించి ఇరానీ కప్‌ను సాధించింది)
28. ఐపీఎల్-7 వేలంలో * 14 కోట్ల ధర పలికి చరిత్ర సృష్టించిన క్రికెటర్?
యువరాజ్‌సింగ్.. బెంగళూర్ రాయల్ చాలెంజర్స జట్టు సొంతం చేసుకుంది.
29. 2014 ఫిబ్రవరిలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎవరు నియమితుల య్యారు?
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్
30. స్పోర్ట్స పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ‘ఫిక్కీ’ ఎవరిని ప్రకటించింది?
దీపికా కుమారి (ఆర్చరీ)
31. జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని ‘ఫిక్కీ’ ఎవరికి ప్రదానం చేసింది?
క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు
32. 2014 ఫిబ్రవరిలో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఉత్తమ ఆటగాడిగా ఎవరిని ఎంపిక చేసింది?
సునీల్ ఛెత్రి
33. {బహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ఎవరు?
శివథాను పిళ్లై
34. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు?
2014 ఫిబ్రవరి 14న
35. జాతీయస్థాయిలో అత్యుత్తమ సుపరిపాలన అందించిన వారికిచ్చే ప్రతిష్టాత్మకమైన చాణక్య అవార్డును 2014 ఫిబ్రవరిలో ఎవరికి అందజేశారు?
ప్రొఫెసర్ సునయన సింగ్ (ఈమె ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్)
36. నేపాల్‌లోని అతిపెద్ద రాజకీయ పార్టీ నేపాలీ కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
సుశీల్ కొయిరాలా
37. 2014 ఫిబ్రవరిలో బాలల కారుణ్య మరణాలను చట్టబద్ధం చేసిన ఐరోపా దేశం?
బెల్జియం (ప్రపంచంలో బాలల కారుణ్య మరణాలు లేదా మెర్సీకిల్లింగ్ను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్లాండ్స)
38. {పపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక-2014 ప్రకారం 180 దేశాల జాబితాలో భారత్‌కు ఎన్నోస్థానం లభించింది?
140
39. 2014 ఫిబ్రవరి 11న విడుదలైన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
ఫిన్లాండ్
40. ఏటా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికను విడుదల చేసే సంస్థ?
రిపోర్టర్స వితౌట్ బోర్డర్స (ప్యారిస్)
41. 2014 ఫిబ్రవరి 13న చెన్నైలో మరణించిన ఛాయాగ్రాహకుడు, సినీదర్శకుడు?
బాలు మహేంద్ర
42. {బిటన్‌కు చెందిన సాహితీ పురస్కారం కోస్టాబుక్ ఆఫ్ ద ఇయర్-2013 ఎవరికి లభించింది?
నాథన్ ఫిలర్ (ఆయన రాసిన నవల ద షాక్ ఆఫ్ ద ఫాల్)
43. 2014 సంవత్సరానికి కొలకలూరి విశ్రాం తమ్మ పురస్కారానికి ఎంపికైన నవల?
యశోధర. రచయిత గూటం రామస్వామి
44. 2014 ఫిబ్రవరిలో బ్రిటన్ ప్రయోగించిన అత్యాధునిక మానవ రహిత యుద్ధవిమానం?
తరనీస్
45. ఆండిస్ పర్వత శ్రేణులు ఏ ఖండంలో ఉన్నాయి?
దక్షిణ అమెరికా
46. భారత మాజీ రాష్ర్టపతి ఆర్.వెంకట్రామన్ ఆత్మకథ?
మై ప్రెసిడెన్షియల్ ఇయర్స
47. ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎవరి రచన?
కార్ల మార్క్స, ఫ్రెడరిక్ ఏంజెల్స్
48. మహాబలేశ్వర్ హిల్‌స్టేషన్ ఏ రాష్ర్టంలో ఉంది?
మహారాష్ర్ట
49. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ఎక్కడ ఉంది?
హైదరాబాద్‌లో
50. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా మహాత్మాగాంధీ ఒకే ఒక్కసారి పనిచేశారు. ఆయన ఏ సమావేశానికి అధ్యక్షత వహించారు?
1924లో బెల్గామ్ సమావేశానికి
51. ఝరియా బొగ్గుగనులు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?
జార్ఖండ్
52. కీల్ కెనాల్ ఏ దేశంలో ఉంది?
జర్మనీ
53. కీనన్ క్రికెట్ స్టేడియం ఏ నగరంలో ఉంది?
జంషెడ్ పూర్
54. దాండియా నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది?
గుజరాత్
55. ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ ఎవరి రచన?
ఫైడోర్ డోస్టోవ్స్కీ (రష్యా)
56. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన పర్వతం?
కిలిమంజారో
57. భారత రిజర్వ బ్యాంక్‌ను ఎప్పుడు స్థాపించారు?
1935 ఏప్రిల్ 1న
58. {V>…y్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు?
దాదాబాయి నౌరోజీ
59. పచ్మర్హి హిల్‌స్టేషన్ ఏ రాష్ర్టంలో ఉంది?
మధ్యప్రదేశ్
60. చిల్కా సరస్సు ఏ రాష్ర్టంలో ఉంది?
ఒడిశా
61. దాస్ క్యాపిటల్ ఎవరి రచన?
కార్ల మార్క్స్
62. మారథాన్ పోటీల్లో ఎంత దూరం పరుగెత్తాల్సి ఉంటుంది?
42.195 కిలోమీటర్లు లేదా 26 మైళ్ల 385 గజాల దూరం
63. నికోస్ అనస్తాసియాడిస్ ఏ దేశానికి అధ్యక్షుడు?
సెప్రస్
64. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఒకే వ్యక్తిని రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించవచ్చు?
153వ అధికరణం
65. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌ను 1920లో ఎవరు స్థాపించారు?
ఎన్.ఎమ్.జోషి, లాలా లజపతిరాయ్
66. జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు స్థాపించారు?
1952 ఆగస్టు 6
67. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య (ఏపీఈసీ) ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
సింగపూర్
68. {పపంచ ధరిత్రీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ఏప్రిల్ 22
69. పండ్లు, కూరగాయలు, పుష్పాల పెంపకాన్ని ఏమంటారు?
హార్టికల్చర్
70. 1964, 1966లో భారతదేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా రెండుసార్లు ఎవరు పనిచేశారు?
గుల్జారీలాల్ నందా