అయ్యవారు వస్తేనే.. నీళ్లిస్తారట
ఇరగవరం, న్యూస్‌లైన్ : ‘అయ్యవారు రాలేదని అమావాస్య ఆగదు’ అనేది సామెత. ఇరగవరంలో రూ.9కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ మంచినీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించే విషయంలో ఆ సామెత కాస్తా రివర్స్ అరుు్యంది. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రారంభింపచేయూలని కాంగ్రెస్ నాయకులు తలపోశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తరుు్యంది. రెండు నెలల క్రితమే ట్రరుుల్ రన్ సైతం విజయవంతంగా నిర్వహించారు. సూక్ష్మ వడపోత పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని తాగడమే తరువారుు అని 10 గ్రామాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో సీఎం వచ్చి దీనిని ప్రారంభిస్తే గానీ నీళ్లిచ్చేది లేదంటూ నాయకులు భీష్మించారు. దీంతో ప్రాజెక్టు పూర్తరుునా ప్రజలకు మాత్రం మంచినీరు సరఫరా కావడం లేదు.
బృహత్తర ప్రాజెక్ట్ ఇది
జాతీయ గ్రామీణాభివృద్ది తాగునీటి (నేషనల్ రూరల్ డెవలప్మెంట్ వాటర్) ప్రాజెక్ట్ కింద రూ.9 కోట్ల నిధులతో దీనిని నిర్మించారు. ఇరగవరం, కావలిపురం గ్రామాల్లో గల చెరువుల్లోని నీటిని సూక్ష్మ వడపోత పద్ధతిలో శుద్ధిచేసి ఇరగవ రం, వేండ్రవారిపాలెం, గుబ్బలవారిపాలెం, గొల్లగుంటపాలెం, గొల్లమాలపల్లి, అనుమాజీపాలెం, చినరాముని చెరువు, పిల్లివారిపాలెం, పద్దిరెడ్డిపాలెం, యర్రారుుచెరువు గ్రామాల ప్రజలకు పైప్లైన్ల ద్వారా అందించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. తొలుత ఇరగవరం చెరువు పరిధిలో పనులు పూర్తయ్యాయి. 2011 ఫిబ్రవరి 6న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎంఎం పల్లంరాజు చేతులమీదుగా శంకుస్థాపన చేశారు.
శుద్ధిచేసిన నీటిని పైప్లైన్ల ద్వారా ఆయూ గ్రామాలకు అందించేందుకు వీలుగా 90 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మించారు. ఫిల్టరేషన్ పారుుంట్లతోపాటు పైప్లైన్ల నిర్మాణాలు కూడా పూర్తి చేశారు. గతంలో చెరువును నీటితో నింపి ట్రరుుల్ రన్ కూడా చేశారు. కలుషితమైన నీటిని తాగుతూ రోగాల బారినపడుతున్న 10 గ్రామాల ప్రజలు ఇక ఆ బాధలు తప్పుతాయని, స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని ఆశించారు. ఉన్నతమైన ఆశయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను నాయకుల మాట కాదనలేక ప్రారంభించకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.