అజేయంగా ఏపీ, తెలంగాణ
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర, తెలంగాణ జట్లు క్వార్టర్స్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. శుక్రవారం మూడో రోజు పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు... 29-18, 29-12 తేడాతో మేజర్ పోర్ట్స్ జట్టుపై, 29-0, 29-2 తేడాతో త్రిపురపై నెగ్గగా... తెలంగాణ జట్టు.... 29-7, 29-0 తేడాతో హర్యానాపై గెలిచింది.
మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు... 29-9, 29-9 తేడాతో ఢిల్లీ పై, 29-1, 29-5 తేడాతో జమ్మూ కశ్మీర్ జట్టుపై విజయం సాధించగా... తెలంగాణ జట్టు 29-0, 29-10 తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై గెలుపొందింది. టోర్నీలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్క గేమ్ కూడా ఓడిపోలేదు.