శివానికి సింగిల్స్ టైటిల్
జాతీయ సిరీస్ టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: తెలుగమ్మాయి శివాని అమినేని జాతీయ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో సింగిల్స్ టైటిల్ సాధించింది. చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో ఆమె బాలికల సింగిల్స్ ఫైనల్లో 6-3, 4-6, 6-3తో శివాని ఇంగ్లే (మహారాష్ట్ర)పై చెమటోడ్చి నెగ్గింది. వారం రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన శ్రావ్య శివాని, సాయి దేదీప్య, షేక్ హుమేరా, సైదా షాజిహా బేగం పాల్గొన్నారు.