క్షయ వ్యాధి నివారణపై బీఎంసీ దృష్టి
సాక్షి, ముంబై: క్షయ(టీబీ) వ్యాధి నియంత్రణకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) చర్యలు తీసుకుంటోంది. నేషనల్ అర్బన్ మిషన్ పథకంలో భాగంగా ఈ వ్యాధి రోగులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందజేయాలని నిర్ణయించింది. ఏడాదిపాటు ఈ పథకాన్ని అమలుచేసేందుకు కార్పొరేషన్‌కు రూ.35 కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చాయని సీనియర్ అధికారి ఒక రు పేర్కొన్నారు.
అయితే రోగుల చికిత్సకు అనుగుణంగా పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందజేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని నగర వైద్యాధికారి మిన్ని ఖేట్రపాల్ అభిప్రాయపడ్డారు .
ప్రస్తుతం రెండు వేల మంది రోగులు క్షయ వ్యాధితో బాధపడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని తెలి పారు. బీఎంసీ అమలు చేసిన నేషనల్ టీబీ కంట్రో ల్ ప్రోగ్రామ్‌లో ఈ విషయం వెల్లడైందన్నారు. పోషక విలువలున్న ఆహారాన్ని అల్పాహారం రూపంలో, లేకుంటే వండిన వంటకాల రూపంలోనైనా అందజేస్తారన్నారు. ఇందుకోసం కార్పొరేషన్ ఆస్పత్రులకు చెందిన న్యూట్రిషనిస్టులు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని బీఎంసీ సీనియర్ వైద్యు డు ఒకరు తెలిపారు.
‘చాలా మంది క్షయ రోగులకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంది. వీరికి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఇస్తే అదనపు శక్తి చేకూరి త్వరగా కోలుకునేందుకు దోహదపడుతుంద’ని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం శివ్డీలోని జీటీబీ ఆస్పత్రిలో అధిక పోషక విలువలు ఉన్న పాలు, గుడ్లను క్షయ వ్యాధి గ్రస్తులకు అందజేస్తున్నామన్నారు. నగరంలో 2013లో 2,394 ఎండీఆర్ టీబీ కేసులు, 2014లో ఇప్పటివరకు 453 టీబీ కేసు లు నమోదయ్యాయి. అయితే 2013లో 90 ఎక్స్‌డీఆర్ టీబీ కేసులు, 2014లో ఫిబ్రవరి వరకు 24 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.