మెసేజ్ కొట్టు.. గోల్డ్ కాయిన్ పట్టు
హైదరాబాద్: నేచురల్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తమ వినియోగదారుల కోసం 'నేచురల్ గోల్డ్ ఫెస్ట్'ను ప్రవేశపెట్టింది. బేగంపేట్‌లోని తాజ్ వివంతా హోటల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ చెఫ్ సంజయ్తుమ్మతో కలిసి ఎస్ఏఆర్ఎల్ జనరల్ మేనేజర్ కేఎస్‌రావు ఈ స్కీమ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేచురల్ ఫెస్ట్ ఆఫర్లో పాల్గొనే వినియోగదారులు లీటరు సామర్థ్యం కలిగిన రెండు నేచురల్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను కొనుగోలు చేస్తే కోడ్ కలిగిన స్క్రాచ్ కార్డును అందజేస్తారన్నారు.
కోడ్‌ను తమ పేరు, పట్టణం పేరుతో కలిపి స్క్రాచ్‌కార్డుపై పొందుపరిచిన టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలని తెలిపారు. ప్రతిరోజూ ఎస్ఎంఎస్ చేసిన మొదటి 15 మందికి ఒక గ్రాము చొప్పున బంగారం గెలుచుకునే అవకాశం ఉంటుందన్నారు. రంజాన్ నుంచి నవంబర్ 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి ఆదివారం విజేతలను ప్రకటిస్తారని తెలిపారు.
ఈ క్యాంపెయిన్ ముగిసే సమయంలో లక్కీ డ్రా కూడా నిర్వహించి బంపర్ విజేతలకు 150 గ్రాముల బంగారం, మొదటి విజేతకు 100 గ్రాములు, రెండో విజేతకు 75, మూడో విజేతకు 50 గ్రాముల చొప్పున బంగారం అందజేస్తామన్నారు. ఈ ఆఫర్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.