యాభై లక్షల మెుక్కలు నాటుతాం
డోర్నకల్ : మండలంలోని తహసీల్దార్ బంజర గ్రామంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డీఐజీ స్థానిక పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ గతేడాది నాలుగు జిల్లాల్లో కేవలం రెండు లక్షల మొక్కలు మాత్ర మే నాటామని తెలిపారు. ఈ ఏడాది నాలుగు లక్షలు నాటాలని నిర్థేశించుకున్నాం. హరితహారం ప్రారంభం రోజే పోలీసులంతా కలిసి ఐదు లక్షలు నాటినట్లు తెలిపారు. వరంగల్ రేం జి పరిధిలోని అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటి వరకు 32 లక్షల మొక్కలు నాటామని పేర్కొన్నారు. గడువు ముగిసే వరకు 50 లక్షలు నాటుతామని తెలిపా రు. నేడు నాటిన మొక్కలు రేపు చెట్లుగా మారి తే ఇప్పటి చిన్నారులకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందు కు వచ్చి సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. బంజర గ్రామాన్ని పోలీసు లు దత్తత తీసుకున్నారని ఇప్పటి వరకు 2000 మొక్కలు నాటారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అంకతి పద్మ, సీఐ హరీష్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు కేశబోయిన స్వరూప, ఎంపీటీసీ సభ్యురాలు వాంకుడోత్ అచ్చమ్మ, తహసీల్దార్ ఎం.కనకరాజు, ఎంపీడీఓ సుదర్శనం, ఏపీఓ శంకర్‌నాయక్, ఆర్ఐ సూరయ్య, ఎస్సైలు ఖాదర్‌బాబా, జగదీష్, హెచ్ఎం వి. సుధాకర్, నాయకులు సీతారామయ్య, అయోధ్యరామయ్య పాల్గొన్నారు.