మహాగణపతి ఉత్సవాలు
విజయవాడ కల్చరల్ :
డూండి గణేష్ సేవాసమితి ఆధ్వర్యాన దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో మహాగణపతి మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల కోసం 72 అడుగుల మట్టి వినాయకుని విగ్రహం సిద్ధం చేశారు. 11 రోజులపాటు వైభంగా నిర్వహించే ఈ వేడుకల్లో రోజూ పూజలు, సాయంత్రం 9 గంటలకు నవహారతులు కార్యక్రమాల నిర్వహణకు డూండి గణేష్ సేవా సమితి ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. భక్తుల స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్లు సిద్ధంచేశారు. ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించారు. కళాశాల ప్రాంగణమంతా విద్యుద్దీపాలతో అలంకరించారు. రోజూ సాయంత్రం కళావేదికపై సంగీత, సాహిత్య, నృత్య భక్తి రసకార్యక్రమాలు ప్రదర్శించనున్నట్లు డూండి గణేష్ సేవా సమితి అధ్యక్షుడు గడ్డం రవికుమార్ తెలిపారు. తొలి రోజు ఉదయం 10.45 గంటలకు పూజలు ప్రారంభమవుతాయని, రోజూ 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వివరించారు. తేపేశ్వరానికి చెందిన భక్తాంజనేయ స్వీట్స్ వారు 8,500 కేజీల లడ్డూను ప్రసాదంగా అందిస్తున్నారని చెప్పారు.