సిరిసిల్లలో ‘నారాయణ’ వైస్ ప్రిన్సిపల్ అరెస్ట్
హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థల ఆడియో టేపుల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. టేపుల లీకేజీకి బాధ్యుడని భావిస్తున్న వైస్ ప్రిన్సిపల్ నవీన్‌గౌడ్‌ను పోలీసులు సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురానున్నారు. నవీన్‌గౌడ్ బెదిరించి వాయిస్ రికార్డ్ చేయించాడని ప్రిన్సిపల్ సరిత అగర్వల్ ఆరోపించారు.
హైదరాబాద్ రామాంతపూర్‌లోని నారాయణ స్కూల్‌కు చెందిన వైస్ ప్రిన్సిపల్ నవీన్ .. అదే బ్రాంచ్‌కు చెందిన ప్రిన్సిపాల్ సరితా అగర్వాల్‌తో మాట్లాడిన సంభాషణలు బయటపడిన విషయం తెలిసిందే. డీమానిటైజేషన్ సమయంలో బ్లాక్‌మనీని నారాయణ యాజమాన్యం వైట్‌మనీగా ఎలా మార్చిందో వీరిద్దరూ ఆ వీడియోలో చర్చించుకున్నారు. అలాగే యాజమాన్యంలోని కీలక వ్యక్తికి ...మహిళలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆ సంభాషణల్లో వెల్లడి అయింది. హయత్‌నగర్ నారాయణ బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి శ్రీలత ఆత్మహత్యకు కారణం ఏంటో కూడా....ఈ ఆడియోలో చెప్పడం సంచలనంగా మారుతోంది.
వనస్థలీపురంలో ఉన్న నారాయణ విద్యాసంస్థల గెస్ట్‌హౌస్ అరాచకాలకు అడ్డాగా మారిందని...ఈ ఆడియో ద్వారా తెలుస్తోంది. నారాయణ సంస్థలకు సంబంధించిన కీలకమైన విషయాలపై చర్చ జరిగిన ఈ ఆడియో టేపు.....ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ విషయం పై నవీన్ నోరు తెరిస్తేనే నిజానిజాలు బయటకి రానున్నాయి.